ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌కు చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-11 15:35:07

ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌కు చెక్

మొన్న క‌ర్నూల్ జిల్లా, నిన్న క‌డ‌ప‌జిల్లా, ఈ రోజు అనంత‌పురం జిల్లా, ఇప్పుడు విజ‌య‌వాడ ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తీ జిల్లాలో ఏదో ఒక‌ నియోజ‌క‌వ‌ర్గ‌వంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో వ‌ర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో త‌మ‌కంటే త‌మ‌కు టీడీపీ అధిష్టానం టికెట్ ను ఫిక్స్ చేయాల‌ని ఫోర్స్ చేస్తున్నారు. గతంలో టీడీపీఎమ్మెల్యేలు పార్టీలో ఉన్న‌ నాయ‌కుల‌తో ఎంతో స‌న్నిహితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక‌రంటే ఒకరికి మింగుడు ప‌డ‌టంలేదు. ఇక తాజాగా విజ‌య‌వాడ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు రావ‌డంతో చ‌ద్ర‌బాబుకు ఏం చేయాలో అర్థం కావ‌టం లేద‌ట‌.
 
తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత నెహ్రూ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. అంతేకాదు నెహ్రూ పార్టీలో చేరేముందు త‌న కూమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ ముందుకు సాగించాల‌ని కోరారు. అయితే ఇందుకు చంద్ర‌బాబు కూడా ఒకే చెప్పారు. ఇక ఆయ‌న పార్టీలో చేరిన కొద్దిరోజులకు అకాలమ‌రణం చెందారు. దీంతో చంద్ర‌బాబు, నెహ్రూ కుమారుడు అవినాష్ కు తెలుగు యువ‌త అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 
 
ఇక అప్ప‌టినుంచి టీడీపీలో మంచి ప‌ట్టు సాదించుకున్నారు ఆయ‌న‌. ఈ క్ర‌మంలో ఎన్నికలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అవినాష్ టీడీపీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ్యాల‌ని ఆలోచిస్తున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో పాటు ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం అయిన పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంపై కూడా అవినాష్ క‌న్నేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్‌, ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ లు టెన్ష‌న్ కు గురి అవుతున్నారట‌. అంతేకాదు అవినాష్ వీరికి వ్య‌తిరేకంగా ఉన్న టీడీపీ నాయ‌కులు త‌న అధినంలో  తెచ్చ‌కుని ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నికల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు అవినాష్ ఏ నియోజ‌క‌వ‌ర్గం వైపు స్కెచ్ వేస్తారో అని గ‌ద్దె రామ్మోహ‌న్‌, ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ బ‌య‌ప‌డుతున్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.