తెర‌పై టీడీపీ ఎమ్మెల్సీ V/S టీడీపీ మంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-18 16:17:08

తెర‌పై టీడీపీ ఎమ్మెల్సీ V/S టీడీపీ మంత్రి

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అధికార తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజ‌కీయాలు అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారుతున్నాయా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కుమ్ములాట‌తో క్యాడ‌ర్ దిశా నిర్ధేశం చేసే నేత‌లు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌రువు అయ్యార‌ట‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇంచార్జ్ ముర‌ళి క‌న్న‌బాబు నిర్వ‌హించారు. అయితే ఇదే క్ర‌మంలో రెండేళ్ల క్రితం ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి టీడీపీ లో చేరారు. 
 
గ‌తంలో కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడు మంత్రిగా ఆత్మ‌కూరు అభివృద్దికి కృషి చేయ‌డం, ఆయ‌న‌కు బ‌ల‌మైన అనుచ‌ర వ‌ర్గం ఉండ‌టంతో ఆనంకు పార్టీ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు. క‌న్న‌బాబు కంటే పార్టీ ఆనంకు ఎక్క‌వ ప్రాధాన్యత‌ ఇచ్చారు. దీంతో ఆవేద‌న చెందిన క‌న్న‌బాబు మంత్రి సోమిరెడ్డి స‌హ‌కారంతో చాప కింద‌నీరులా ప‌ట్టు సాధిస్తూ వ‌చ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఆనంకు దీటుగా క‌న్న‌బాబు జోక్యం పెరిగింది.
 
దీంతో ఇరు వ‌ర్గాల‌ మ‌ధ్య ప‌లు అంశాలలో ఘ‌ర్ష‌ణ‌లు కూడా పెరిగాయి. పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూసి ఆనంలో అసంతృప్తి పెరుగుతూ వ‌చ్చింది. క‌న్న‌బాబు వ‌ర్గం ఏం చెప్పిన ఇట్టే ప‌నులు కావ‌టం, అయితే ఆనం స్వ‌యంగా చెప్పినా అధికారులు లైట్ తీసుకోవ‌డంతో ఆయ‌న‌లో అసంతృప్తి పెరిగిపోయింది. త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడు లేనంత‌గా అవ‌మానాలు ఎదుర్కొంటున్నాన‌ని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ మ‌హానాడులో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
పేరుకు ఇంచార్జ్ త‌ప్ప త‌న‌కు చార్జింగ్ లేద‌ని నిరంత‌రం బాద‌ప‌డుతున్నార‌ట‌. అంతేకాదు సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇక అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. తాను టీడీపీలో ఇమ‌డ‌లేన‌ని ఆయ‌న పార్టీ నేత‌ల‌కు స్ప‌ష్టం చేశారాట‌. 
 
ఇక మ‌రో వైపు జిల్లా కేంద్ర స‌హకార అధ్య‌క్షుడు మంత్రి నారాయ‌ణ వ‌ర్గం తెర‌మీద‌కు తీసుకువ‌చ్చింది. ఆత్మ‌కూరు టీడీపీ ఇంచార్జ్ గా ఆయ‌న‌నే నియ‌మించాల‌ని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నికల్లో ధ‌నుంజ‌య రెడ్డి అయితే బాగుంటుంద‌ని చంద్ర‌బాబుకు సూచించార‌ట‌. ఇక ధ‌నుంజ‌య రెడ్డి తెర‌మీద‌కు రావ‌డంతో మంత్రి సోమిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురి అయ్యార‌ట‌. 
 
తాను బ‌ల‌ప‌రుస్తున్న క‌న్నాబాబుకే పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో బ‌లం ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన ధ‌నుంజ‌య రెడ్డికి అంత సామ‌ర్ధ్యం లేద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.  ఇక మ‌రోవైపు ఆనం టీడీపీని వీడుతున్నార‌ని జిల్లా వ్యాప్తంగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో ఆయ‌న రాజీనామా చేసి సానుభూతి పొంద‌క‌ముందే స‌స్పెండ్ చేయాల‌ని క‌న్న‌బాబు వ‌ర్గం భావిస్తుంద‌ట‌. దీంతో ఆత్మ‌కూరులో టీడీపీకి ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హించాల‌నే విష‌యంపై తీవ్ర‌మైన చ‌ర్చ నెల‌కొంది.  గ్రూపు త‌గాదాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలోని కొంద‌రు నేత‌లు కార్య‌క‌ర్త‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.