టీడీపీ ఇంటిలోనే వ‌ర్గ‌పోరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-08-23 02:58:42

టీడీపీ ఇంటిలోనే వ‌ర్గ‌పోరు

మంత్రి అయ్య‌న్న పాత్రుడు ఇంట్లో న‌ర్సిప‌ట్నం అసెంబ్లీ సీటు కోసం కుస్తిలు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వ‌చ్చేఎన్నిక‌ల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చెయ్య‌న‌ని మంత్రి అయ్య‌న్న పాత్రుడు గ‌తంలో స్ప‌ష్టం చేశారు. త‌న బ‌దులు త‌న కుమారుడు విజ‌య్ ను న‌ర్సీ ప‌ట్నం నుంచి పోటీ చేయించాల‌ని మంత్రి భావిస్తున్నారు.
 
ఒక వేల త‌న కుమారుడుని పార్టీ త‌ర‌పున అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీ చేయించాల‌ని భావిస్తే త‌న భార్య ప‌ద్మావ‌తిని అసెంబ్లీకి పోటీ చేయించాల‌ని మంత్రి అయ్య‌న్న పాత్రుడు ఆలోచిస్తున్నార‌ట‌. ఇక నా.... సంగ‌తేంటి అని ముందుకు వ‌స్తున్న అయ్య‌న్న పాత్రుడు త‌మ్ముడు స‌న్యాసి పాత్రుడు న‌ర్సీప‌ట్నం సీటు కోసం పోటీ ప‌డుతున్నారు.  
 
ఇక ఇదే క్ర‌మంలో తూర్పుగోదావ‌రి జిల్లా కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నంద‌రావు ఆయ‌న సోద‌రుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్నంత ప‌రిస్థితి నెల‌కొంది. కొత్త‌పేట స్థానం నుంచి గ‌తంలో బండారు స‌త్య‌నంద‌రావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయ‌న సోద‌రుడు శ్రీనివాస రావు వ్య‌తిరేకంగా ప‌నిచేశార‌నే ఆరోప‌న‌లు వ‌చ్చాయి.అయితే ఈ నేప‌థ్యంలో కొత్తపేట స్థానం నాదే అని బండారు శ్రీనివాసురావు చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు జ‌న‌సేన పార్టీ ఏర్పాటు కావ‌డంతో బండారు శ్రీనివాసురావు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఇక మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ఇంట్లో కూడా  అన్న‌ద‌మ్ముల మ‌ధ్య సీటు కోసం వివాదం న‌డుస్తోన్న‌ట్లు స‌మాచారం జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ సారి మంత్రి సోద‌రుడు మాజీ ఎమ్మెల్సీ నారాయ‌ణ రెడ్డి పోటీకి సిద్దం అవుతున్నార‌ట‌. గ‌తంలో పోటీ చెయ్యాల‌ని ఆయ‌న భావించిన‌ప్ప‌టికి అధిసాధ్యంకాలేదు. అయితే ఈ సారి భ‌రిలో దిగాల‌ని బ‌లంగా అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఇక అది సాధ్యం కాక‌పోతే త‌న కుమారుడుని అయినా పోటీ చేయించాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. మంత్రి ఆధినారాయ‌ణ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌ద‌వుల‌ను అనుభ‌విస్తుంటే మేము ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలుపాలా అని మాజీ ఎమ్మెల్సీ నారాయ‌ణ రెడ్డి త‌న అనుచ‌రుల మ‌ధ్య అంటున్న‌ట్లు స‌మాచారం. 
 
ఓ వైపు టీడీపీ అధికారంలో ఏ ఒక్క హామీను కూడా నెర‌వేర్చ‌కున్నార‌ని ప్ర‌జ‌లు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తుంటే అభివృద్ది కార్య‌క్రాలు మ‌రిచిపోయిన ఎమ్మెల్యేలు వారి కుటుంభ స‌భ్యులు సీట్ల కోసం గొడ‌వ ప‌డ‌టం పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లుగా ఉంద‌ని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇక మ‌రోవైపు త‌మ నేత‌ల కుటుంబాల్లో సీట్ల కోసం ఏర్ప‌డిన చిచ్చు ఎటు వైపు దారి తీస్తుందో అని అనుచ‌రుల్లో ఆందోళ‌న ప్రారంభ‌మైంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.