ఆ టికెట్ క‌ర్ణాట‌క వ్య‌క్తికే డైల‌మాలో టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-12 17:39:09

ఆ టికెట్ క‌ర్ణాట‌క వ్య‌క్తికే డైల‌మాలో టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లాలో క‌ర్ణాట‌క రాజ‌కీయం మొద‌లు అయింది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమారస్వామి త‌న అనుచ‌రుడికి తిరుప‌తి టీడీపీ టికెట్ ఇప్పించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. తిరుప‌తికి చెందిన ఓవి ర‌మ‌ణ ద‌శాబ్ధ‌కాలంగా మాజీ ప్ర‌ధాని దేవే గౌడ శిశ్యుడుగా ఉంటున్నారు. అయితే గ‌తంలో దేవే గౌడ సిఫార‌స్సుల‌తో ర‌మ‌ణ టీటీడీ బోర్డ్ లో ప‌ద‌విని పొందారు. ఇక అప్ప‌టినుంచి దేవే గౌడ‌తో పాటు ఆయ‌న కుటింబికులు ఎవ‌రు తిరుమ‌ల‌కు వ‌చ్చినా ర‌మ‌ణ అన్నీ తానై చూస్తున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో తిరుప‌తి టీడీపీ టికెట్ పై క‌న్నేశార‌ట‌. ప్ర‌స్తుతం ఈ నియెజ‌క‌వ‌ర్గంలో ఉన్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుగున‌మ్మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ద‌న్న ప్ర‌చారం టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ర‌మ‌ణతో పాటు మ‌రో న‌లుగురు తెలుగు త‌మ్ముళ్లు కూడా తిరుప‌తి టీడీపీ టికెట్ ను ఆసిస్తున్నారట‌. 
 
ఇక ర‌మ‌ణ వ్య‌వ‌హార శైలి చూసిన టీడీపీ నేత‌లు ఆయ‌న రాక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ట‌. ఏ మాత్రం ప‌లుకుబ‌డి లేని ర‌మ‌ణ‌కు టీడీపీ టికెట్ ఇస్తే తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెబుతున్నార‌ట‌. ర‌మ‌ణ‌కు టీడీపీ టికెట్ ఇవ్వాల‌ని ఇప్ప‌టికే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో రాయ‌బారం న‌డిపిన‌ట్లు స‌మాచారం. అంతేకాదు త‌న దూతల‌ను అమ‌రావ‌తికి పంపి చంద్ర‌బాబుతో మంత‌నాలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. 
 
అయితే ఇందుకు చంద్ర‌బాబు కూడా సూత్ర‌దాయ‌కంగా అంగీకారం తెలిపిన‌ట్లు టీడీపీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ర‌మ‌ణకు టీడీపీ టికెట్ ఇస్తే తాము తిరుగుబాటు చెయ్య‌క త‌ప్ప‌ద‌ని తిరుప‌తి టీడీపీ నేత‌లు అధినేత చంద్ర‌బాబు ముందు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందు ఇదేమిట‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా త‌ల‌లు ప‌ట్టుకున్నార‌ట‌. 
 
మ‌రోవైపు ఈ నెల 13, 14వ తేదీల్లో తిరుమ‌ల‌కు వ‌స్తున్న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి చేత ర‌మ‌ణ టీడీపీలో చేరుతున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న ఇప్పించ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.