గెలిచే స్థానంలో వైసీపీ నాయ‌కులు కుమ్ములాట‌లు... ఇలా అయితే 2019లో క‌ష్టం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-22 18:13:52

గెలిచే స్థానంలో వైసీపీ నాయ‌కులు కుమ్ములాట‌లు... ఇలా అయితే 2019లో క‌ష్టం

2009లో ఆవిర్భ‌వించిన విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి అప్ప‌ట్లో కాంగ్రెస్ త‌ర‌పున‌ మ‌ల్లాది విష్ణు గెలిచారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి ఓట‌మిపాలు అయ్యారు విష్ణు. అయితే ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌పును పోటీచేసి బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన గౌత‌మ్ రెడ్డి బోండాకు గ‌ట్టి పోటీ ఇచ్చి చివ‌రిలో వెనుతిరిగారు. రాష్ట్ర విభ‌జ‌న సెగ‌తో కాంగ్రెస్ పార్టీకి గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లు ప‌డ‌లేదు. దీంతో బోండా ఉమా విజ‌యం సులువు అయింద‌నే చెప్పాలి. 
 
అయితే ఈ నాలుగేళ్ల‌లో బోండా ఉమా వ‌రుస వివాదాల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఆయ‌న కుమారుడు కార్ రేసింగ్, భూక‌బ్జాలు, సీఐడీ కేసులో బోండా భార్య‌పేరు రావ‌డంతో ఆయ‌న వ‌ళ్ల‌ పార్టీకి కూడా త‌ల‌నొప్పులు వ‌చ్చాయి. దీంతోపాటు నియోజ‌క‌ర్గంలో అనుచ‌రులు ఇష్టా రాజ్యంతో వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆ ప్ర‌భావం బోండా పై ప‌డింది. సెంట్ర‌ల్ నియోజ‌క‌వర్గంలో అభివృద్ది ప‌నులు అంతంత మాత్రంగా జ‌రుగుతున్నా కొన్ని ప్రాంతాల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌కపోవ‌టం, అనుచ‌రుల ఆగ‌డాలు బోండా ఉమాకు మైన‌స్ గా మారాయి.
 
క‌ళ్యాణ‌మండ‌పం వ్య‌వ‌హారం భూ క‌బ్జా సీఐడీ కేసులు కార్పోరేష‌న్ సీఎస్సైఐ స్మ‌శాన ఆక్ర‌మ‌ణ అంశాలు బోండాకు పెద్ద మ‌చ్చ‌గా మారాయి. ఆయ‌న త‌ర‌చు ఎదో ఒక వివాదంతో అధిష్టానం దృష్టిలో ప‌డుతూనే ఉన్నారు. ఇక మ‌రో వైపు సింగ్ న‌గ‌ర్, కండ్రిగ ప్రంతాల‌ల్లో ప్ర‌భుత్వం క‌ట్టిన ఇళ్ల‌ల్లో వివాదాల్లో ఉన్నాయి. నివాస  ప్రంతాల్లో స‌దుపాయాలు లేక, ఇళ్ల‌ప‌ట్టాలు లేక సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కొన్నిఏరియాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 
 
ఇక విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌లంగా ఉన్నా పార్టీలో కుమ్ములాట‌లు అధినాయ‌క‌త్వానికి త‌ల‌నొప్పిగా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009లో పోటీ చేసిన రాధా వ‌చ్చే ఎన్నిక‌ల్లోను మ‌ళ్లీ ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని భిస్మించ‌టంతో  అధిష్టానానికి త‌ల‌నొప్పి మొద‌లైంది. నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణుకు ఇవ్వ‌ల‌నే ప్ర‌తిపాధ‌న ఉంది. 
 
ఈ క్ర‌మంలో రాధ‌ను అవ‌ని గ‌డ్డ‌నుంచి పోటీ చేయ్యాల‌ని పార్టీ అధిష్టానం ప్ర‌తిపాదించినా తాను సెంట్ర‌ల్ నుంచే పోటీ చేస్తాన‌ని ప‌ట్టుప‌డుతుండ‌టంతో పార్టీ పెద్ద‌లు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని వంగ‌వీటి రాధ చెబుతున్నా విష్ణు కూడా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేసుకుంటూ పోతున్నారు. దీంతో రానున్న‌రోజుల్లో ఇక్క‌డ వివాదాల‌కు తావు లేకుండా అభ్య‌ర్థి ఎంపీక వైసీపీ అధినాయ‌క‌త్వానికి స‌వాల్ గా మార‌బోతుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.