ఎమ్మెల్సీ ప్ర‌క‌ట‌న వైసీపీలో చిచ్చు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-25 14:18:20

ఎమ్మెల్సీ ప్ర‌క‌ట‌న వైసీపీలో చిచ్చు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో, బీసీల‌కు త‌న పార్టీలో ఎటువంటి ప్ర‌యారిటీ ఇస్తాను అనేది తెలియ‌చేశారు.. ఇక అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీ త‌ర‌పున చ‌ట్ట‌స‌భ‌ల్లో రాజ్యంగ బ‌ద్దంగా బీసీల‌కు అందంలం ఎక్కిస్తా అని చెప్పారు..ఇటు తెలుగుదేశం బీసీ క్రెడిట్ ను, జ‌గ‌న్ ఒక్క ప్ర‌క‌ట‌న‌తో మొత్తం గోదావ‌రిలో క‌లిపేశారు.ఇటు బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ అన్నీ అబ‌ద్దాలు చెబుతున్నారు అని విమ‌ర్శించారు.. వారికి  స‌పోర్ట్ గా తెలుగుదేశం ఎన్నీ కామెంట్లు చేసినా, తెలుగుదేశం ఆస్తాన మీడియా స‌పోర్ట్ చేసినా జ‌గ‌న్ త‌న పందా మార్చుకోలేదు..
 
జ‌గ‌న్ తూర్పుగోదావ‌రిలో ఎంట‌ర్ అవుతూ బీసీల‌కు రాజ‌మండ్రి పార్ల‌మెంట్ సీటు అనే స‌రికి అక్క‌డ ఉన్నా నాయ‌కుల‌కు కూడా ఎటువంటి మాటా రాలేదు.. అధినేత డెసిష‌న్ ఫైనల్ కాబ‌ట్టి సైలెంట్ అయ్యారు.. అయితే ఇటు ఆర్దికంగా బ‌లంగా ఉన్నా నాయ‌కులు ప‌బ్లిక్ ఫిగ‌ర్స్ చాలా మంది రాజ‌మండ్రి ఎంపీ సీటు ఆశించినా, జ‌గ‌న్ బీసీల‌కు ఇస్తాను అని తెలియ‌చేశారు.. ఇక అందులో వారే తేల్చుకోవాలి ఆర్దికంగా ఎవ‌రు బ‌లంగా ఉన్నారు అనేది ..
 
ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉన్నా ఇప్పుడు పాల‌కొల్లు న‌ర‌సాపురం ఆచంట నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త చిచ్చు వ‌చ్చి ప‌డింది.. ఇటు క‌వురు శ్రీనివాస్ కు జ‌గ‌న్ మొద‌టి ఎమ్మెల్సీ అవ‌కాశం ఇస్తాను అని తెలియ‌చేశారు.. అలాగే ఎమ్మెల్సీ అవాక‌శంతో పాటు జిల్లాలో బీసీ ప‌ద‌విని అలాగే రాజ‌మండ్రి పార్ల‌మెంట్ బాధ్య‌త‌ను అప్ప‌గించారు జ‌గ‌న్.
 
అయితే క‌వురు శ్రీనివాస్ రెండు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే అయింది క్రియాశీల‌కంగా  పార్టీలో ఉండి.. ఎందుకు ఆయ‌న‌కు ప‌ద‌వి ఇస్తారు అని ఇటు కొందరు స్వ‌ప‌క్షంలో విప‌క్షంలా త‌యారు అయ్యారు.. సొంత పార్టీ నేత‌లే సోష‌ల్ మీడియాలో ట్రోలింగుల‌కు పాల్పడుతున్నారు.. ఇటు మోషేన్ రాజు ప‌ద‌విని ప‌క్క‌న పెట్టి క‌వురుకు రాజ‌మండ్రి బాధ్య‌త‌ల  అప్ప‌గించారు.. అలాగే మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకి అయినా  హామీ ఇస్తారు అనుకుంటే ఆయ‌న‌కు కూడా ద‌క్క‌లేదు అని ఇటు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌ర్చ అయితే అప్పుడే మొద‌లైంది.
 
దీనికి జిల్లా నాయ‌కులు వివాదాలు రాకుండా అడ్డుక‌ట్ట వేస్తున్నారు.. అయితే త్వ‌ర‌లో జ‌గ‌న్ కూడా ఈ విష‌యం పై కేడ‌ర్ తో చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది.. మ‌రి ఈ వివాదానికి ఆయ‌న ఎలా ఫుల్ స్టాప్ పెడ‌తారో చూడాలి.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం క‌రెక్ట్ అని ఆయ‌న బీసీల‌కు పెద్ద పీట వేశారు క‌నుకే క‌వురుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు అని అంటుంటే, మ‌రో వ‌ర్గం ఎప్ప‌టి నుంచో ఉన్న మేకా శేషుబాబును ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని విమ‌ర్శిస్తున్నారు.. స్వ‌ప‌క్షంలో ఈ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు జ‌గ‌న్ ఎలా పుల్ స్టాప్ పెడ‌తారో  చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.