టీడీపీ ఎమ్మెల్యే వియ్యంకుడు ఇళ్ల‌పై ఐటీ దాడులు కీల‌క ప‌త్రాలు స్వాధీనం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-30 02:14:58

టీడీపీ ఎమ్మెల్యే వియ్యంకుడు ఇళ్ల‌పై ఐటీ దాడులు కీల‌క ప‌త్రాలు స్వాధీనం

అధికారంలో త‌మ ప్ర‌భుత్వ‌మే ఉంది... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌మ‌కు నిత్యం అండ‌గ ఉండ‌గా భ‌య‌మెందుకు దండ‌గా అన్న చందంగా టీడీపీకి చెందిన నేత‌లు నాలుగు సంవ‌త్స‌రాల నుంచి విచ్చ‌ల విడిగా వ్యాపారాన్ని కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వానికి ప‌న్ను క‌ట్ట‌కుండా తిరుగుతున్నారు. దీంతో అక‌స్మాత్తుగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బినామీల నుంచి పార్టీ ఎంపీ ఇంటిపై అలాగే వారి బందువుల ఇళ్ల‌పై విసృత‌స్థాయిలో ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి.
 
దీంతో టీడీపీ నాయ‌కులు దెబ్బ‌కు వ‌ణికి పోతున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు ఎంపీ సీఎం ర‌మేష్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేసి అత‌నికి సంబంధించిన‌ రిత్విక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప‌లు కీలక ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు వియ్యంకుడు ఇంటిపై, ఆఫీసుల‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించి ప‌లు కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఇక ఈ విష‌యాన్ని తెలుసుకున్న య‌ర‌ప‌తినేని కంగుతిన్నారు. వియ్యంకుడు హ‌రిబాబు తాజాగా న‌డుపుతున్న‌ పేరం గ్రూప్ పై దాడులు జ‌రుపుతున్నారు. తిరుప‌తి హైద‌రాబాద్, విశాఖ‌ప‌ట్నం, ఇళ్లు, ఆఫీసుల‌పై ఈ రోజు తెల్ల‌వారు జాము నుంచి సోదాలు నిర్వ‌హిస్తున్నారు. కాగా ఇప్ప‌టికే ఎమ్మెల్యే శ్రీనివాస‌రావు అక్ర‌మ మైనింగ్ నిర్వ‌హించి అధిక‌సంఖ్య‌లో డ‌బ్బుల‌ను సంపాదించుకుని ప‌న్ను క‌ట్ట‌కుండా వేల‌కోట్లు ఆర్జిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంతేకాదు ఇందుకు సంబంధించి హైకోర్టులో విచార‌ణ కూడా సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న వియ్యంకుడు ఇంటిపై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం తెలుగు త‌మ్ముళ్ల‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

షేర్ :

Comments

0 Comment