ఆకాశ‌మే హ‌ద్దుగా సీఎం ర‌మేష్ ఆస్తులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp cm ramesh
Updated:  2018-10-12 01:45:57

ఆకాశ‌మే హ‌ద్దుగా సీఎం ర‌మేష్ ఆస్తులు

రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ పై ఆదాయ‌పు ప‌న్నుల శాఖ ఈ రోజు ఉద‌యం నుంచి దాడుల‌ను నిర్వ‌హిస్తుంది. ఈ దాడులను హైద‌రాబాద్ తో పాటు వైఎస్సార్ జిల్లాలోని ఆయ‌న స్వ‌గ్రామంలో సోదాలు జ‌రుగుతున్నాయి. సీఎం ర‌మేష్ చూపించిన ఆదాయానికి ఆయ‌న క‌ట్టిన ప‌న్నుకు పొంత‌న లేక‌పోవ‌టం, లెక్క‌కు మించిన అక్ర‌మ ఆస్తులు ఉన్నాయ‌న్న స‌మాచారంతో అధికారులు త‌నిఖీలను చేప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది.
 
సోదాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో సీఎం ర‌మేష్  ఢిల్లీలో ఉన్నారు. ప‌క‌డ్బంది స‌మాచారంతో ఉదయం తొమ్మిది గంట‌లకు అధికారులు ఆయ‌న ఇంటికి వెళ్ల‌గా ర‌మేష్ మ‌నుషులు ఐటీ అధికారులను అడ్డుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌ధ్య‌వ‌ర్తిగా ప్ర‌భుత్వ అధికారుల‌ను తెచ్చామ‌ని ఐటీ అధికారులు ఫోన్లో చెప్పినా సీఎం ర‌మేష్ అందుకు అంగీక‌రించ‌లేదు. 
 
మ‌ధ్య‌వ‌ర్తిగా త‌న బంధువుల‌ను పెట్టాల‌ని ఒత్తిడి చేసినా అధికారులు అంగీక‌రించ‌లేదు. దీంతో చివ‌రికి సీఎం ర‌మేష్ ప్ర‌తిపాధించి ఇత‌ర వ్య‌క్తుల‌ను మ‌ధ్య‌వ‌ర్తిగా పెట్టి సోదాల‌ను జ‌రుపుతున్నారు అధికారులు. అంతేకాదు హైదారాబాద్‌ లో ఉన్న ఆయ‌న కంపెనీల‌కు సంబంధించిన ఖాతాల లావాదేవీల‌ను త‌కిఖీ చేశారు అధికారులు. అలాగే ర‌మేష్ కు సంబంధించిన బ్యాంకు వివ‌రాలు మెనేజ‌ర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత ప‌లు ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. మ‌రో వైపు పొట్ల‌దుర్తిలోని ఆయ‌న నివాసం నుంచి కొన్ని ముఖ్య‌మైన ఫైళ్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.