రాష్ట్రంలో ఐటీ దాడులు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

it raids
Updated:  2018-10-09 03:30:16

రాష్ట్రంలో ఐటీ దాడులు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..

రాజకీయ వర్గాల్లో బాగా వైరల్ గా మారిపోయిన వర్డ్ ఐటీ దాడులు.. రాష్ట్రంలో పలువురు వ్యాపారస్తులు, నిర్మాణరంగ సంస్ధల యాజమాన్యాలపై పెద్ద ఎత్తున ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులకు సంబంధించి.. అసలు సినిమా ముందుందని ఐటీ శాఖా అధికారులు పేర్కొంటున్నారు..  ఏపీలో ఐటీ దాడులు జరపాలని మోదీ ప్రభుత్వం అనుకున్నదే తడవుగా కొంతమందిపై దాడులు చేశారు..  ఇంకా భవిష్యత్‌ దాడులకు వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తుంది. 
 
అయితే ఇప్పటివరకు చేసిన సోదాలు, దాడుల్లో ఏం ఆధారాలు లభ్యమయ్యాయన్నదానిపై మాత్రం పెదవి విప్ప డం లేదు. సినిమా మొత్తం పూర్తయ్యాకే వివరాలు వెల్లడిస్తామని ఒక ఐటీ అధికారి పేర్కొనడం గమనార్హం. ఇంకా రాష్ట్రంలోని కొందరు బడా నేతలతో పాటు ఒకరిద్దరు అధికారులపైనా దాడులు జరిగే అవకాశముందని అంటున్నారు.ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వమే చేయిస్తోందన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చిన నేపథ్యంలో వీటిని ప్రస్తుతానికి వాయిదా వేసినా.. తెరవెనుక అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 
 
ఎక్కడో ఒక చిన్న బ్యాంకుకు సంబంధించిన మారుమూల శాఖ నుంచి కొంత సమాచారం సేకరించామని.. దాని ఆధారంగా తీగ లాగుతున్నామని కూడా ఐటీ వర్గాలు చెప్పుకొంటున్నట్లు తెలిసింది. తమ వద్ద ఉన్న సమాచారం, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అసలు దాడులు ఇంకా జరగాల్సి ఉందని ఈ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో మరిన్ని రాజకీయ పరిణామాలు, ఆసక్తికర విషయాలకు ఐటీ దాడులు నిలయంగా మారతాయని, భవిష్యత్‌లో సంచలన దాడులు ఉంటాయని కూడా అంతర్గత సంభాషణల్లో అనుకుంటున్నట్లు తెలిసింది. 
 
ఇప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్‌ నేత బీద మస్తాన్‌రావు, ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీలపైనా దాడులు జరిగాయి. శుభగృహ, సదరన్‌ కనస్త్రక్షన్స్‌, వీఎస్‌ లాజిస్టిక్స్‌ తదితర సంస్థల్లోనూ సోదాలు జరిపారు. ఈ దాడుల్లో ఏం దొరికిందన్న విషయాలను ఐటీ శాఖ ఎక్కడా చెప్పలేదు.ఇది ట్రయల్‌ మాత్రమేనని.. ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానిస్తున్నాయని తెలిసింది.  ఈ నేపధ్యంలో త్వరలో మళ్ళీ దాడులకు ఐటి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి దాడుల్లో కీలకమైన నేతలతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నతాధికారులు, పెద్ద నిర్మాణ సంస్ధల యాజమాన్యాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 
 
కీలకమైన నేతలంటే బహుశా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, చాలా మంది ప్రజాప్రతినిధులు అడ్డదిడ్డంగా సంపాదించేశారు. వారికి చాలా మంది ఉన్నతాధికారులు వత్తాసుగా నిలిచారు. అందుకే ముందుంది మొసళ్ళ పండుగ అంటూ ఐటి ఉన్నతాధాకారులు వ్యాఖ్యానించినట్లుగా ఓ సమాచారం వైరల్ గా మారింది. దాంతో టిడిపి మంత్రులు, నేతలు ఐటి దాడులంటేనే ఉలిక్కి పడుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.