చర్చకు ప్రభుత్వమే ముందుకు రావాలి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

iyr krishna rao
Updated:  2018-05-26 07:16:50

చర్చకు ప్రభుత్వమే ముందుకు రావాలి

సీనియర్  IAS అధికారి, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్సి IYR క్రిష్ణారావు గారు రచించిన “ఎవరి రాజధాని అమరావతి”  పుస్తకం రాష్ట్రంలో ప్రదాన చర్చగా మారింది. రాజధానిని ఎంపిక చేసిన సందర్బంలో వారు ప్రధాన కార్యదర్సిగా ఉండటం వలన వారు ప్రస్తావిస్తున్న అంశాలకు అత్యంత ప్రాదాన్యత లబిస్తుంది. అధికార పక్షం ఎప్పటి లాగే వారు మాట్లాడుతున్న అంశాలను చర్చకు పెట్టి విబేదించడమో లేదా సమర్దించడమో కాకుండా కుట్రకోణంలో ఎదురుదాడిని ఎంచుకుంది. ప్రచార మాద్యమాలు, ప్రదాన రాజకీయ పార్టీలు కచ్చితంగా IYR రచిచంచిన పుస్తకంపై తమ అబిప్రాయాలు చెప్పాలి.
 
ముకుసూటి తనం, నమ్మిన అంశాలపై రాజీలేని పోరాటం,పట్టుదలకు ప్రతీక IYR. తిరుపతిలో వారి రచనపై చర్చ జరుగుతున్న సందర్బంలో ఒక విషయాన్ని కచ్చితంగా ప్రస్దావించాలి. బహుషా   IYR  అనే అధికారి  లేకుండా ఉండి ఉంటే నేడు చారిత్రక తిరుమల ఆనంద నిలయం ఇపుడున్న రూపంలో ఉండేది కాదు. IYR గారు రచనలో ప్రభుత్వంపై విమర్సకన్నా ప్రపంచ దేశాల అనుబవాలను ప్రాతిపదికగా నూతన రాష్ట్రానికి రాజధాని ఎలా ఉండాలి అన్న అంశాన్ని మాత్రమే వారు ప్రజల ముందు ఉంచారు. IYR ప్రస్దావించిన అంశాలను పరిసీలిస్దే నూతన రాజధాని ఎంపిక, దాని నిర్మాణం కోసం వారు ప్రపంచ దేశాలను తిరిగి పరిసీలించినారా అన్న అనుభూతి కలగక మానదు.
 
IYR రచించిన పుస్తకంలో ప్రధాన అంశాలు..
మహనగరం- ఆంద్రప్రదేశ్.....  మహనగరం ఒక కల మాత్రమే. అది పాలించే వారి ఆనందం పేరు ప్రతిష్టల కోసం నిర్మించేది ఏమాత్రం కాదు. ఎందు కంటే ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం. విభజన అనంతరం ఏర్పడిన పూర్వ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది శ్రీభాగ్ ఒప్పందం. ఎందుకంటే దాని ప్రాతిపదికనే మద్రాసు నుంచి విడిపోయింది. అందులో ఉన్నది ప్రదానంగా అబివృద్ది వికేంద్రీకరణ రాజధాని, హైకోర్టు ఒక చోట అవసరం లేదని. ఏపి ఉత్తరాంద్ర, రాయలసీమ, మద్యకోస్తా ఉత్తర కోస్తా లుగా విబిన్నంగా ఉంటుంది. 
 
అందుకే కేంద్రీకృత అభివృద్ది అవసరం లేదు. మరో ముఖ్యమైన అంశం హైదరాబాదు పోలిన మహనగరం ఆలోచన సాదారణ ప్రజలకు ఉండవచ్చును కానీ పాలకులకు ఉండటం మంచిది కాదు. ఇప్పటికే తిరుపతి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు లాంటి నగరాల జనాబా దాదాపు 5 లక్షలు పై మాటే. విశాఖ జనాబా మరింత ఎక్కువ. అంటే అరకోటి జనాబా గలిగిన నగరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక దాదాపు 15 నగరాల స్దాయి కలిగిన పట్టణాలు 15 పైగా ఉన్నాయి. వాటి జనాబా కూడా దాదాపు అరకోటి. పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు ఉన్నాయి. 
 
మొత్తంగా పరిసీలిస్దే ఏపీలో కొత్తగా మరో నగరాన్ని నిర్మించడానికి అనువైన వాతావరణం లేదు. అలాంటిది ఏకంగా మహనగరాన్ని నిర్మించడానికి పూనుకోవడం తొందరపాటు చర్య అవుతుంది. IYR ఉదహరించింది కూడా స్వల్పకాలంలో మహనగరాలను నిర్మించలేము. ప్రపంచంలో కూడా ఆదర్సమైన అమెరికాకు రాజధాని వాషింగ్ టన్ డీ సీ అయితే ఆదేశ మహనగరం న్యూయార్క్. ఆదేశంలోని ఒక రాష్ట్రం కాలిపోర్నీయా రాజధాని సాక్రమెంటో అయితే ఆ రాష్ట్రంలోని మహనగరం లాస్ ఏంజల్స్. అలాగే ఆస్ట్రేలియా రాజధాని కనబెర కాగా మహనగరాలు మాత్రం సిడ్నీ, మెల్ బోన్స్. IYR పై రెండు దేశాల రాజధానులను, మహనగరాలను ఉదహరించడంలో దూరదృష్టి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఆర్దిక స్దిత తప్ప వాటిని రాష్ట్రం పోలి ఉంది. విజయవాడ, తిరుపతి, విశాఖ అబివృద్ది చెందిన నగరాలు ఉన్నాయి. కొత్తగా మరో నగరాన్ని నిర్మిండం కన్నా అందుబాటులో ఉన్న నగరాలపై శ్రద్ద పెట్టవచ్చు అన్న సూత్రీకరణ అత్యంత విలువైనది.
 
అమరావతి ఎంపిక –అభివృద్ది ఆందోళ‌నకరం... 
అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన పద్దతి బహుశా ప్రపంచంలోనే ఎక్కడా జరగని రీతిలో జరిగింది. శ్రీభాగ్ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కేంద్రం నియమించిన శివరామక్రిష్ణన్ నివేదికను పరిసీలించక, తాను నియమించిన నారాయణ నివేదికలో ఏముంది అన్న అంశాలుపై చర్చకూడా పెట్ట కుండా ఏక పక్షంగా అమరావతిని కొన్ని గంటలలో ఎంపిక చేసినారు. ప్రపంచంలో కనీస పరిసీలన చేయకుండా ఎంపిక చేసిన రాజధానిగా అమరావతి మిగిలిపోతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్దికంగా మంచి స్దితిలో రాష్ట్రం లేదు.
 
కేంద్రం నియమించిన కమిటిని అసలు పట్టించుకోలేదు. విభజన చట్టంలో రాజధాని మౌళిక వసతులు, సచివాలయం, హైకోర్టు, గవర్నర్ బంగ్లా లాంటివి కేంద్రం నిర్మించాలి. వాటి విషయంలో ఏనాడు కేంద్రాన్ని అడిగిన దాకలాలు లేవు. అనేక మంది నిపునుల దృష్టిలో అమరావతి ప్రాంతం వరద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతం. గొప్ప నిర్మాణాలకు అనుకూలమైన ప్రాంతం కాదు. అక్కడ జరిగే నిర్మాణాలకు వ్యయం కూడా అదికంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ముందుకు వెలతామంటుంది. అననుకూల ప్రాంతం అయిన అమరావతి నిర్మాణం జరగడం లేదు. ప్రభుత్వం దృష్టి మొత్తం అమరావతి వైపు కేంద్రీకృతం చేయడం వలన అబివృద్దికి అవకాశం ఉన్న తిరుపతి, విశాఖ కు తీవ్రనష్టం జరుగుతుంది.
 
శివరామక్రిష్ణన్ నివేదిక శిరోదార్యం- IYR చూచనలు అనుసరనీయం...
నగర నిర్మాణాల పట్ల మంచి అవగాహణ కలిగిన శివరామక్రిష్ణన్ నివేదిక నేటి పరిస్దితులలో శిరోదార్యంగా కనిపిస్తుంది. అదే సందర్బంలో తన అనుబవం, ప్రపంచ దేశాల పరిస్దితులను జోడించి IYR రచించిన పుస్తకం లోని అంశాలు అనుసరనీయంగా కనిపిస్తున్నాయి. IYR కి దురుద్దేశ్యాలు ఆపాదించడం మాని వారి చూచనలను పరిసీలించడం మంచిది. IYR పదవిలో ఉన్నపుడు ఎందుకు చెప్పలేదు అంటూ అడ్డగోలు వాదనలు చేయడం మంచిది కాదు. కనీస పద్దతులు లేని రాజకీయ పార్టీలలో పని చేసే నాయకులు పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీకి బిన్నంగా మాట్లాడకూడదని నితులు చెపుతున్న వారు అఖిలభారత సర్వీసులో ఉన్న వ్యక్తి వృత్తి దర్మానికి బిన్నంగా మాట్లాడకూడదన్న విషయం తెలియదా. 
 
పై సర్వీసు లో ఉన్న వారు పదవి విరమణ తర్వాత కూడా ఒక ఏడాది పాటు ఇతర ప్రయివేటు సర్వీసులో కూడా ఉండకూడదు అన్న నిబందన ఉందన్న సంగతి తెలిసి కూడా అపుడు ఎందుకు మాట్లాడ లేదు అంటున్నారు అంటే అమరావతి విషయంలో మాదారి మాది అన్న వైకరితో ప్రభుత్వం ఉన్నట్లు కనపడుతుంది. అమరావతి కేంద్రీకృత అబివృద్ది కారణంగా జరిగే నష్టానికి  మూల్యం చెల్లించేది ప్రజలు మాత్రమే. శివరామక్రిష్ణన్ తాను చనిపోయే ముంది ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాక్యలు ఆందోళన కలిగించడమే కాదు పాలకులను, ప్రజలను ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. 
 
“నాయుడి గారు ముందున్న ప్రధాన అంశం రాష్ట్ర సమతౌల్య అబివృద్ది. ఇప్పటికీ నాయుడు గారికి తన అడుగులు వెనుకకు తీసుకొనే అవకాశం ఉన్నది. ఒక చరిత్రలో నిలిచిపోయే రాజధాని నిర్మాణం ప్రధాన అంశం కాదు. ఈనాడు ప్రధాన అంశం రాష్ట్రం ప్రభుత్వం ఆత్మహత్యా సాదృశ్యంగా రాష్ట్ర వనరులను శక్తిని రాజధాని ప్రాజెక్టు కోసం తాకట్టు పెట్టడం”.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.