త్వ‌ర‌లో మ‌రో హింట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-28 18:12:42

త్వ‌ర‌లో మ‌రో హింట్

ఏపీలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్య‌లు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగుదేశంలో ప్ర‌కంప‌న‌లు లేపుతున్నాయి.. అమ‌రావ‌తి నిర్మాణం, తెలుగుదేశం ప‌రిపాలన, చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు మాజీ సీఎస్ ..
 
ఆయ‌న ఎటువంటి వ్యాఖ్య‌లు చేసినా వెంట‌నే తెలుగుదేశం నుంచి ఓ టీమ్ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తుంది ఇలా విమ‌ర్శ‌లు చేసి బ్రాహ్మ‌న‌  కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని కూడా ఆయ‌న వ‌దులుకున్నారు.. ఇక ఆయ‌న ఎప్పుడూ తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు చేయ‌డం పై అమ‌రావ‌తికి మొద‌టి సీఎస్ కావ‌డంతో ఆయ‌న‌పై తెలుగుదేశం కూడా ఎటువంటి నెగిటీవ్ కామెంట్లు చేసే సాహ‌సం చేయ‌దు.
 
అయితే తాజాగా మ‌ళ్లీ ఆయ‌న తెర‌పైకి వ‌చ్చారు....ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నిరోజులుగా పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు... ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల లాభం జరిగిందని నాలుగేళ్ల పాటు చంద్రబాబు మాట్లాడుతూ వచ్చారని.. కానీ ఇపుడు నష్టపోయామని చెబుతున్నారన్నారు.
 
ఇక‌నైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఏపీ రాజధాని అమరావతిపై తాను రాసిన  ఎవరి రాజధాని అమరావతి   పుస్తకంలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక త్వరలో మరిన్ని వాస్తవాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. త్వ‌ర‌లో ఎటువంటి విష‌యాలు ఆయ‌న బ‌య‌ట‌పెట్ట‌నున్నారా అని ఆలోచ‌న వ‌స్తోంది నాయ‌కుల్లో తెలుగుదేశం పార్టీలో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.