ఐ.వై.ఆర్‌ కృష్ణారావు కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nara chandrababu naidu and iyr krishna rao image
Updated:  2018-03-10 02:33:51

ఐ.వై.ఆర్‌ కృష్ణారావు కీల‌క వ్యాఖ్య‌లు

మాజీ సీఎస్ ఐ.వై.ఆర్‌ కృష్ణారావు సీఎం చంద్ర‌బాబు పై గ‌తంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.. దీంతో ఆయ‌న‌కు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి కూడా తొలిగించారు.. దీంతో రాష్ట్రంలో కాస్త అల‌జ‌డి క‌లిగింది అధికారులలో....  ఇక అమ‌రావ‌తి నిర్మాణం పై ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే, తాజాగా చంద్ర‌బాబు పై ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్యలు చేశారు.
 
తాను  చూసిన ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి బెస్ట్‌. ఆయన సమావేశాలకు వెళ్లాలంటే అధికారులకు ప్రిపరేషన్‌ తప్పనిసరిగా ఉండేది అంత పర్ ఫెక్ట్  గా ఆయ‌న ఉండే వారు ప‌రిపాల‌న‌లో . ఆరోగెన్స్‌తోపాటు ఇంటెలెక్చువల్‌ ఉన్న సీఎం ఆయన అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు.
 
తాజాగా ఆయ‌న ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కీల‌క విష‌యాలు  తెలియ‌చేశారు... స్విస్  చాలెంజ్‌ విధానంపై, తాను దాఖలు చేసిన పిటిషన్‌ హైకోర్టులో ఉందని, న్యాయపరిధిలో ఉండటంతో దీనిపై తాను మాట్లాడబోనని అన్నారు కృష్ణారావు.
 
ఏపీకి పరిపాలనా రాజధాని సరిపోతోందని పేర్కొన్నారు. విజయవాడతో పాటు ముఖ్య నగరాల్లో సమాంతర అభివృద్ధి జరగాల్సిన అవసరముందని చెప్పారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరణ సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిస్థితి, ఏపీలో పరిస్థితి వేరు అని చెప్పారు
 
కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను  తాను విభేధించానని, అందుకే తనను పక్కన పెట్టారని వెల్లడించారు. చంద్రబాబు ధోరణిలో సంకుచితత్వం కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు ఆయ‌న . రాజధాని ఎంపికలో కొందరి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంత తేలిక‌గా  వస్తుందని అనుకోవడం లేదని అన్నారు. ఏపీలో జ‌రిగిన కొన్ని విష‌యాల‌పై తాను ప్ర‌శ్నించినందుకే ఇటువంటి ప‌రిస్దితి వ‌చ్చింది అని అన్నారు ఆయ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.