చంద్ర‌బాబు లేఖ‌పై ఐవైఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 16:03:31

చంద్ర‌బాబు లేఖ‌పై ఐవైఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో వెంక‌టేశ్వ‌ర స్వామి అభ‌ర‌ణాల‌ విష‌యంలో అవ‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని, అలాగే స్వామి వారి నైవేధ్యం విష‌యంలో మార్పులు జ‌రుగుతున్నాయంటూ ర‌మ‌ణ దీక్షితులు బ‌య‌ట‌పెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌కుగాను టీటీడీ బోర్డ్ 100 కోట్లు జ‌రిమానా విధిస్తూ ర‌మ‌ణదీక్షితుల‌ను బాధ్య‌త‌ల నుంచి తొల‌గించారు. 
 
ఇక తాజాగా టీటీడీ న‌గ‌ల విషయంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లేఖ‌పై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు స్పందిస్తూ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో ట్వీట్ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జితో  న్యాయ విచారణ చేయించాల‌ని ఆయ‌న కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆ స్థాయిలో విచారణ అవసరమని భావించి కోరితే అది వేరే విషయం. అటువంటప్పుడు దీక్షితులు విజయసాయి గారి మీద పరువునష్టం దావా లు కూడా అర్థరహితం అవుతాయని ఐవైఆర్‌ కృష్ణారావు స్ప‌ష్టం చేశారు మ‌రో ట్వీట్ చేస్తూ..
 
అంతేకాదు కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం న్యాయ విచారణ కోరుకుంటే అది అర్ధరహితం అవుతుంద‌ని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం తమ అమూల్య సమయాన్ని దానికోసం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రాజకీయంగా దానిని ఎదుర్కోవలసి ఉంటుందని ఐవైఆర్‌ కృష్ణారావు ట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.