2019లో జేసీ డిమాండ్స్ ఇవే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-25 04:29:19

2019లో జేసీ డిమాండ్స్ ఇవే

అవిశ్వాసం లేదు పోరాటం లేదు అంటూ  అధికార తెలుగుదేశం పార్టీ డ్రామాను బ‌ట్ట‌బ‌య‌లు చేసారు ఆనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి..  అవిశ్వాసం త‌ర్వాత‌ మళ్ళి స్వ‌రం మార్చారు. ఎంపీల‌కు విలువ లేదు, చంద్ర‌బాబు పాల‌న‌లోనే లోపాలు ఉన్నాయ‌ని, పార్ల‌మెంట్ లో అవిశ్వాసం పెడితే ఏమి వ‌స్తుంద‌ని బాబుకు అవిశ్వాసం ముందు రోజు జేసీ ముఖ్య‌మంత్రికి చుక్క‌లు చూపించారు. 
 
అంతే కాదు విప్ లేదు గిప్ లేదు తాను విప్ ను కూడా దిక్క‌రిస్తాన‌ని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌న‌కు ఈ ఎంపీ ప‌ద‌వితో లాభం లేద‌ని ఈ నెల 25 లోపు తాను రాజీనామా ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని చెప్పారు. దీంతో ఆ పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉలిక్కి ప‌డ్డారు. ఇక చేసేది ఏమిలేక జేసీని దారిలోకి తెచ్చేందుకు నానా అవ‌స్త‌లు ప‌డ్డారు. త‌న ఎంపీల‌పై త‌న‌కే విశ్వాసం లేకుండా పార్ల‌మెంట్ లో అవిశ్వాసం పెడితే అభాసుపాలు అవుతామ‌ని భావించిన ముఖ్య‌మంత్రి చండ్ర‌బాబు నాయుడు రాజీకి ప్ర‌య‌త్నించార‌ట‌. 
 
అవిశ్వాసానికి ముందురోజు జేసీ పెట్టిన ఐదు డిమాండ్లలో ఒక్క‌టైన అనంత‌పురం రోడ్ల విస్త‌ర‌ణ జీవోను జారీ చేశారు. దీంతో టీడీపీ ఎంపీలు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసానికి జేసీ హాజ‌రు అయ్యారు. అయినా కూడా జేసీ త‌న డిమాండ్లన్నీ నెర‌వేర్చుకునేందుకు సోమ‌వారం పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు డుమ్మాకొట్టారు. దీంతో హుటా హుటీనా జేసీ దివాక‌ర్ రెడ్డిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న నివాసానికి ర‌ప్పించుకుని రాజీ కుదుర్చుకున్నార‌ట‌. 
 
జేపీ దివాక‌ర్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆయ‌న డిమాండ్లను అధికారుల వ‌ద్ద‌కు పంపార‌ట‌. దీంతో స‌చివ‌లాయాలంలోని ప‌లు పేచీల్లో ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకున్నార‌ట‌.  అనంత‌పురం జిల్లాలోని ప‌లు ప్రాజెక్ట్ ల కాంట్రాక్ట్ లు, ఇత‌ర వ‌ర్కుల‌తో పాటు టీచ‌ర్ల బ‌దిలీల‌పై కూడా బాబు దగ్గర హామీ తీసుకున్నార‌ట‌. జేసీ పెట్టిన పేచీతో వాట‌న్నింటిని సాధించుకున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 
 
వ‌ర్క్ ల డిమాండ్లతో పాటు ప‌లు ఎమ్మెల్యే టికెట్ల‌పై కూడా బాబు వ‌ద్ద జేసీ పంచాయితీ పెట్టార‌ట. త‌న కుమారుడు, త‌న సోద‌రుడుతో పాటు ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి, అలాగే గురునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మ‌ధుసుద‌న్ గుప్తాల‌కు సంబంధించిన టికెట్ల‌పై ప‌ట్టుప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం రాయ‌దుర్గం, గుత్తి, అనంత‌పురం తాడిప‌త్రి సీట్ల‌పై జేసీ పెట్టిన ఈ పంచాయితీకి చంద్ర‌బాబు మాత్రం ఇంకా ఎలాంటి హామీ ఇవ్వ‌లేద‌న‌ని స‌మాచారం. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.