జ‌గ‌న్ కు 70 శాతం బాబుకు 30 శాతం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 11:08:51

జ‌గ‌న్ కు 70 శాతం బాబుకు 30 శాతం ?

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి, ప్ర‌తి ప‌క్ష నేత‌, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చాలా విష‌యాల్లో  వ్య‌త్యాసం ఉంటుంది... బాబు అధికారంలో ఉన్నా లేకున్నా తన వాగ్దాటి మాత్రం మార్చుకోరు... త‌న తెలివి తేట‌ల‌తో, రాజ‌కీయ‌ అనుభ‌వంతో 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో అనేక హామీల‌ను ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు..ఈ ఎన్నిక‌ల త‌ర్వాత‌ అధికార పీటాన్నిద‌క్కించుకున్న తెలుగు త‌మ్ముళ్లు, ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన‌ హామీల‌ను ఏ ఒక్క‌టి కూడా అమ‌లు ప‌ర‌చ‌లేదు బాబు స‌ర్కార్. 
 
తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇత‌ర దేశాల నుంచి పెట్టుబ‌డులు తీసుకువ‌స్తాన‌ని, పెట్టుబ‌డులు వ‌స్తే నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని తెలిపారు చంద్ర‌బాబు...అలాగే దీంతో పాటు మ‌రో ఐదు సంవ‌త్స‌రాలలోపు రాష్ట్రాన్ని ఉన్న‌త స్థాయిలో తీర్చిదిద్దుతాన‌ని బాబు గ‌తంలో పేర్కొన్నారు... అయితే ఇంత వ‌ర‌కూ  ఆ ప్ర‌స్తావ‌న ఊసే లేక‌పోవ‌డంతో, ప్ర‌జ‌లు ప‌లు చోట్ల విద్యార్థి సంఘాల నేత‌లు, నిరుద్యోగులు మండిప‌డుతున్నారు.
 
మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అంత రాజ‌కీయ అనుభ‌వం లేకున్నా కానీ, తాను చెప్పిన మాట‌ల‌కు క‌ట్టుడి ఉండే నాయ‌కుడిగా ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి మంచి గుర్తింపు పొందుతున్నారు జ‌గ‌న్... విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా, రైల్యేజోన్ నుంచి రాష్ట్రానికి పెట్టుబ‌డులు దాక ప్ర‌తీ విష‌యంలోనూ క్షేత్ర‌స్థాయిలో అభివృద్ది జ‌ర‌గ‌లేద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి...రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే బాగు ప‌డుతుంద‌న్న నేప‌థ్యంలో, చంద్ర‌బాబు ప్ర‌త్యేక ప్యాకేజీపై  జై కొట్టారు... పోనీ అదైనా సాధించారా అంటే అది కూడా సాధించ‌లేక పోయారు బాబు. 
 
దీంతోపాటు చంద్ర‌బాబు సుమారు ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ప‌ద‌మూడు సంవ‌త్స‌రాలు అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు. అయినా కేంద్రం నుంచి ఒక్క హామీను కూడా  సాధించ‌లేక పోతున్నారు... త‌న‌కు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  ప్ర‌జ‌లు ఒక్క సారి అవ‌కాశం ఇస్తే, నాలుగు విడత‌ల వారిగా న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేస్తాన‌ని చెపుతున్నారు జ‌గ‌న్.. అయితే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీల‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించ‌డం మొద‌లు పెడుతున్నారు ప్ర‌జ‌లు.
 
ఈ క్ర‌మంలో వైయ‌స్ జ‌గ‌న్ హోదావైపు అడుగు వేస్తున్నారు... రాష్ట్రానికి హోదా ప్ర‌క‌టించే వ‌ర‌కూ  ఎందాకైనా పోరాడుతాన‌ని జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వ‌స్తున్నారు. ఇక అవిశ్వాస తీర్మానానికి కూడా వైసీపీ రెడీ అవుతోంది. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ పార్టీ త‌ర‌పున నాయ‌కులు కేంద్రం పై పోరాడి ప్ర‌త్యేక హూదా సాధన కోసం పార్ల‌మెంట్లో త‌మ గ‌ళం విప్ప‌నున్నారు.. అలాగే పార్టీ త‌ర‌పున జ‌గ‌న్ వాయిస్ పెర‌గ‌డం, కేంద్రంతో పోరాడ‌టంలో జ‌గ‌న్ త‌న పందా చూపుతున్నారు. దీంతో తాజాగా జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల్లో 70 శాతం పాజిటివ్ వేవ్స్ క‌నిపిస్తున్నాయి.. ఇటు తెలుగుదేశానికి 30 శాతం మాత్ర‌మే ప్రజా మ‌ద్ద‌తు ఉంది అని అంటున్నారు అమ‌రావ‌తి ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.