ఆ మూడు స్ధానాలు బీసీల‌కే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 18:16:13

ఆ మూడు స్ధానాలు బీసీల‌కే

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌పున త‌న నిర్ణ‌యాల‌తో దూసుకుపోతున్నారు.. ముఖ్యంగా ఎంపీ సెగ్మెంట్లు ఎవ‌రికి ఇచ్చేది, ఏఏ సామాజ‌కి వ‌ర్గాల‌కు ఇచ్చేది చెప్పుకుంటూ ముందుకు క‌దులుతున్నారు.. ముఖ్యంగా పార్టీ త‌ర‌పున జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌జల్లో ఎప్పుడు మొద‌లుపెట్టారో అప్పుడే ఎంపీ సెగ్మెంట్ల పై త‌న ప్ర‌క‌ట‌న చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నారు.. ముఖ్యంగా  అనంత‌పురం ఎంపీ సెగ్మెంట్ వైసీపీ త‌ర‌పున  బీసీకి కేటాయిస్తాను అని తెలియ‌చేశారు.
 
అలాగే క‌ర్నూలు ఎంపీ సెగ్మెంట్ కూడా బీసీల‌కు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు వైయ‌స్ జ‌గ‌న్.. అయితే ఈ రెండింటిలో ఏదో ఒక‌టి బీసీకి కేటాయిస్తారు అని  లేదా రెండూ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.ఇటు తాజాగా రాజ‌మండ్రి ఎంపీ సీటు పై కూడా ఆయ‌న ఫిక్స్ అయ్యారు.. ఇక్క‌డ కూడా బీసీల‌కు ఎంపీ సీటు ఇస్తాను అని తెలియ‌చేశారు ఆయ‌న‌. అయితే బీసీల‌కు తెలుగుదేశం ఇప్ప‌టి వ‌ర‌కూ ఎర్ర తివాచీ ప‌రిచింది అని అనుకునేవారు, కాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క‌న్నా, బీసీల‌కు వైసీపీ ఎంతో మేలు చేసేలా రాజ‌కీయ ప‌ద‌వులు ఇచ్చేలా ముందుకు వెళుతోంది.
 
ఇక రాజ‌మండ్రి ఎంపీ సెగ్మెంట్ బీసీల‌కు అన‌గానే ఇక్క‌డ పార్టీ త‌ర‌పున జోష్ వ‌చ్చింది మ‌రీ ముఖ్యంగా కాపు క్ష‌త్రియ ఓటు బ్యాంకు బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఇక్క‌డ జిల్లాలో ఉండ‌టంతో ఇక్క‌డ జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం తీసుకున్నారు అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇటు తూర్పుగోదావ‌రిజిల్లాలో ఇంకెన్ని నిర్ణ‌యాల‌తో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తారో చూడాలి... మొత్తానికి జ‌గ‌న్ తీసుకున్న ఈనిర్ణ‌యం పై పార్టీ నేత‌లే కాదు బీసీ సంఘాలు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.