అమరావతిలో జగన్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 11:59:53

అమరావతిలో జగన్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

ఏపీకి ప్ర‌త్యేక హోదా పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న పందాని మార్చ‌డం లేదు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని, కేంద్రం ఇచ్చిన హామీ ప్ర‌కారం, ప్ర‌త్యేక హూదా ఇచ్చి తీరాల్సిందే అని.. ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడిలా జ‌గ‌న్ ముందుకు వెళుతున్నారు.
 
ఇప్ప‌టికే రాజ‌కీయంగా జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌తో ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్నారు.. పార్ల‌మెంట్ స‌మావేశాలో ఏపీ ప్ర‌జ‌ల‌కు కేంద్రం ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని ఆయ‌న ఓ సంచ‌ల‌న డెసిష‌న్ తీసుకున్న విష‌యం తెలిసిందే... మార్చి 5 వ తేదిన ఢిల్లీలో ధ‌ర్నాకు పిలుపునిచ్చింది వైసీపీ..
 
ఇక నెల‌రోజుల పాటు వైసీపీ పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో త‌మ గ‌ళం విప్ప‌నుంది...మార్చి 5 నుంచి  నెలరోజులు కేంద్రానికి స‌మ‌యం ఇచ్చి, ఆపై చివ‌రి రోజు ఏప్రియ‌ల్ ఆర‌వ తేదిన కేంద్రం ఎటువంటి ప్ర‌క‌టన‌, ప్ర‌త్యేక హోదా పై చెయ్య‌క‌పోతే, త‌మ ఎంపీలు రాజీనామా చేస్తారు అని తెలిపారు జ‌గ‌న్.
 
ఇక అమ‌రావ‌తిలో జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు అని వైసీపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు... పాదయాత్ర మ‌ధ్య‌లో అమ‌రావ‌తిలో హోదా కోసం దీక్ష చేయాలని జ‌గ‌న్  ఆలోచిస్తున్నార‌ని, దీనికి సంబంధించి కార్యాచ‌ర‌ణ విధానాల గురించి పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.