అన్ని రాజకీయ పార్టీలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan tweets
Updated:  2018-03-20 01:33:29

అన్ని రాజకీయ పార్టీలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా నిర్విరామంగా పోరాటం చేస్తున్న వైసీపీ నేత‌లు.. అందులో భాగంగానే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది... ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు వైసీపీ నేత‌లు.. వారు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు..
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరికను గుర్తించి, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని, జగన్ విజ్ఞప్తి చేశారు..పార్లమెంట్‌లో అన్ని పార్టీల చేస్తున్న పోరాటాలను మేము గౌరవిస్తున్నామ‌ని అలాగే మీ రాష్ట్ర సమస్యలను మేము అర్థం చేసుకుంటున్నామ‌ని, మా రాష్ట్ర ప్రజల కోరికను గుర్తించి మాకు సహకరించాల‌ని దేశ రాజ‌కీయ నాకుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు...
 
‘‘ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సంజీవని..రాష్ట్ర విభజనతో అభివృద్ధిలో 50 సంవత్సరాలు వెన‌క్కి వెళ్ళాము... రాష్ట్రం అభివృది వైపు పయనించాలంటే ప్రత్యేక హోదా అవసరం...లేకుంటే రాష్ట్రం మరిన్ని కష్టాలపాలవుతుంది "...పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి మోసం చేసినందుకు గాను కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాము...అందుకే మా రాష్ట్ర ప్రజల కోరికను మన్నించి సభలో ఎటువంటి అవాంతరాలు లేకుండా సభ సజావుగా సాగి, అవిశ్వాసంపై చర్చ జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు మానవతా దృక్పథంతో అలోచించి చర్చకు సహకరించాలని జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేసారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.