మ‌రో ముగ్గురికి వైసీపీలో కీల‌క ప‌ద‌వులు ఇచ్చిన జ‌గ‌న్ I

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 13:50:00

మ‌రో ముగ్గురికి వైసీపీలో కీల‌క ప‌ద‌వులు ఇచ్చిన జ‌గ‌న్ I

వైసీపీ అధినేత తూర్పుగోదావ‌రి జిల్లా పాద‌యాత్ర‌లో త‌న దూకుడుతో వెళుతున్నారు.. పార్టీలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ పాద‌యాత్ర ప‌శ్చిమగోదావ‌రి  నుంచి తూర్పుగోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఇటు పశ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి పాద‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాలో చేరేస‌రికి జిల్లాలో వైసీపీ వేవ్స్ బలంగా ఉన్నాయి అని తెలుస్తోంది.
 
గ‌త ఎన్నిక‌ల్లో ఫిరాయింపు సెగ్మెంట్ల పై కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌నున్నారు.. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్ర పై ఇటు అధికార పార్టీ ఆందోళ‌న‌లో ఉంది..ముఖ్యంగా అధికార పార్టీ పై వైసీపీ ఎటువంటి స్ట్రాట‌జీలు అవ‌లంభించాలి అన్నా, ఇక్క‌డ గోదావ‌రి జిల్లాలో కాస్త డైల‌మాలో ఉంది.
 
అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూనే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.. ఇటు రంప‌చోడ‌వ‌రం వైసీపీ స‌మ‌న్వ‌య‌కర్త‌ను నియ‌మించారు అలాగే..మ‌రో ఇద్ద‌రికి ప‌ద‌వులు కేటాయించారు జ‌గ‌న్.వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొయ్యే మోషేను రాజూని జ‌గ‌న్ నియ‌మించారు.. అలాగే క‌వురు శ్రీనివాస్ కు రాజమండ్రి పార్ల‌మెంట్ పార్టీ జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మించారు జ‌గ‌న్.
 
ఈ ఇద్ద‌రి నియామ‌కాల‌ను ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అయితే ముందు నుంచి వైసీపీకి వెన్నుద‌న్నుగా నిలిచిన కొయ్యేమోషేన్ రాజాకు ఈ ప‌ద‌వి రావ‌డం పై ఆయ‌న అభిమానులు వైసీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు. అన్ని వ‌ర్గాల‌కు వైసీపీలో మంచి ప‌ద‌వులు వ‌స్తాయి అని గుర్తింపు ఉంటుందని అంటున్నారు పార్టీ శ్రేణులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.