భీమ‌వ‌రానికి జ‌గ‌న్ హామీతో గ్రంధికి సూప‌ర్ స‌క్సెస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 15:01:00

భీమ‌వ‌రానికి జ‌గ‌న్ హామీతో గ్రంధికి సూప‌ర్ స‌క్సెస్

భీమ‌వ‌రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తారా, ఇక్క‌డ జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో తెలుగుదేశం గ్రాఫ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. తెలుగుదేశం ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు..కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన   ఎమ్మెల్యే.. 2014 ఎన్నిక‌ల్లో కూడా ఎమ్మెల్యే అయ్యారు.. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన ఈ ఎమ్మెల్యే జిల్లాలో బాగానే పేరు తెచ్చుకున్నా, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ లో ఎటువంటి ఎదుగుద‌ల లేక‌పోవ‌డంతో వెంట‌నే పార్టీ మారి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరారు.
 
ఈ స‌మ‌యంలో తెలుగుదేశం త‌ర‌పున భీమ‌వ‌రం టికెట్ సంపాదించి ఎమ్మెల్యే అయ్యారు రెండ‌వ టెర్మ్ .. ఇక తెలుగుదేశం రాజ‌కీయంగా ప‌వ‌న్ మోదీతో ప్రచారం చేయ‌డం, అలాగే కాపులకు ఇచ్చిన‌ హామీలు, ఇక్క‌డ కాపు ఓట‌ర్ల‌ను బాగా ప్ర‌బావితం చేశాయి.. అలాగే మెజార్టీ క్ష‌త్రియ ఓటు బ్యాంకు కూడా  తెలుగుదేశం బీజేపీతో జ‌త‌క‌ట్ట‌డంతో తెలుగుదేశానికి ఓట్లు మ‌ల్లేలాచేశాయి.
 
అయితే ఇటు తెలుగుదేశం పార్టీకి ప్ర‌జ‌ల్లో 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్న అభిమానం ఇప్పుడు ఉందా అంటే కాస్త కొర‌వ‌డింది అనే చెబుతున్నారు స్ధానికులు.. ముఖ్యంగా ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపార్టీ జెండా రెప‌రెప‌లాడిస్తుందా అనే కొత్త ప్ర‌శ్న క‌నిపిస్తోంది...రెండు టెర్మ్ లు ఎమ్మెల్యే అయిన అంజిబాబు మ‌రోసారి కూడా ఎమ్మెల్యే అవుతాన‌ని హ్యాట్రిక్ సాధిస్తాను అని చెబుతున్నారు.. మ‌రో వైపు ఇక్క‌డ 2004లో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా ఉండి త‌ర్వాత ప‌రిణామాల‌తో వైసీపీ చేరిన గ్రంధి శ్రీనివాస్ కూడా ప‌దేళ్లు అధికారానికి దూరంగా ఉండ‌టంతో ఇక్క‌డ మ‌ళ్లీ ఆయ‌న వైసీపీత‌ర‌పున ఎమ్మెల్యేగా నిల‌బడేందుకు రెడీ అవుతున్నారు.
 
ఇటు జ‌గ‌న్ కూడా భీమ‌వ‌రంలో ఆయ‌న‌కే టికెట్ అని ప్ర‌క‌టించారు.. మ‌రోవైపు వైసీపీ త‌ర‌పున ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకున్నా ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతున్నా ఇక్క‌డ యువ‌త కూడా గ్రంధి శ్రీనివాస్ వెనుకే ఉంది అని తెలుస్తోంది.ఇటు జ‌గ‌న్ కూడా పాద‌యాత్ర‌లో గ్రంధి హ‌వాని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు..ఆయ‌న‌కే వైసీపీ త‌ర‌పున భీమ‌వ‌రం సీటు అని ప్ర‌కటించారు... అయితే తెలుగుదేశం త‌ర‌పున గెలిచినా ఇక్క‌డ మెగా ఆక్వాపుడ్ పార్కు వివాదం, ఓ కులానికి సంబందించి వివ‌క్ష జ‌రిగితే ఎటువంటి శ్ర‌ద్ద తెలుగుదేశం చూపించ‌లేదు అని విమ‌ర్శ‌లు మ‌రింత పెరిగాయి... దీంతో ఇవ‌న్నీ వైసీపీకి మ‌రింత మైన‌స్ గా క‌నిపిస్తున్నాయి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అందుకే ఇక్క‌డ వైసీపీ జెండా ఎగురుతుంది అని అంటున్నారు.
 
మ‌రో ప‌క్క ఎమ్మెల్యేగా అంజిబాబు త‌న దూకుడు కూడా చూపుతున్నారు.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచి తీరుతా అని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు..అయితే వ‌చ్చే ఎన్నికల్లో టికెట్ ఆయ‌న‌కు ఇస్తారా లేదా అనేది ఆలోచ‌న.. అయితే ఇటు మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆయ‌న‌కు వియ్యంకుడు కావ‌డంతో ఆయ‌న‌కు ఎలాగైనా టికెట్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి అని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు ..మ‌రి చూడాలి భీమ‌వ‌రం పాద‌యాత్ర జ‌గ‌న్ కు ఎలాంటి మైలేజ్ తీసుకువ‌స్తుందో. అలాగే స‌ర్వే కూడా గ్రంధికి ఫేవ‌ర్ రావ‌డం పీకే టీం కూడా భీమ‌వ‌రంలో జ‌గన్ -గ్రంధి టీం గెలుపు ప‌క్కా అని తేల్చాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.