జ‌గ‌న్ మ‌రో కొత్త హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 18:01:04

జ‌గ‌న్ మ‌రో కొత్త హామీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం సైకిల్ పార్టీ కంచుకోట అయిన కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం సెగ్మెంట్ లో ఉంగటూరు మండలం వెన్నూతల, లంకపల్లి, వెంకట రామపురం మీదుగా  నిర్విరామంగా కొన‌సాగుతోంది... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక  తాజాగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ప్రైవేట్ టీచ‌ర్స్ అంద‌రూ క‌లిసి జ‌న‌నేత జ‌గ‌న్ ను ఈ రోజు క‌లుసుకుని వారు త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు... త‌మ నెలస‌రి  జీతాలను కాలేజ్ యాజ‌మాన్యం స‌క్ర‌మంగా అందించ‌కుండా  ఇబ్బంది పెడుతోంద‌ని తెలిపారు... అయితే గ‌తంలో ఈ స‌మ‌స్య‌ను ఎన్నోసార్లు  ప్ర‌భుత్వ దృష్టికి తీసుకు వెళ్లినా ఫ‌లితం ద‌క్క‌లేద‌ని జ‌గ‌న్ కు త‌మ బాధ‌ను వివ‌రించారు... దీంతో పాటు కళాశాల యాజమాన్యాలు మానవత్వంతో కనీసం వారానికి రెండు రోజులు సెలవులు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్ ను కోరారు.
 
అయితే వారికి జ‌గ‌న్ భ‌రోసా ఇస్తూ తాము అధికారంలోకి వ‌స్తే వెంటనే టీచ‌ర్స్ స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు..అంతే కాదు ప్రైవేట్ టీచ‌ర్ల‌ కోసం ఒక ప్ర‌త్యేకమైన చ‌ట్టం తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  టీచర్స్ కు ఒకే రకమైన నియమ, నిబంధనలు ఉండేలా చూస్తామని చెప్పారు...అలాగే  కళాశాలల యాజమాన్యాల ఉద్యోగులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకునే విధంగా చట్ట సవరణ చేస్తామని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.