ఆ ముగ్గురు నాయ‌కుల‌కు జ‌గ‌న్ హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 11:09:07

ఆ ముగ్గురు నాయ‌కుల‌కు జ‌గ‌న్ హామీ

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ నాయ‌కుడు చేరాడు, వెంట‌నే అక్కడ పార్టీ త‌ర‌పున అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న నాయ‌కుడిని కాదు అని, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో  జ‌గ‌న్ ఆ కొత్త నేత‌కు సీటు ఇచ్చారు.. అప్ప‌టి వ‌ర‌కూ వైసీపీలో సీటు  త‌న‌కే అనుకున్న నాయ‌కుడు, అనూహ్యాంగా వేరే చోట నుంచి పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డం జ‌రిగింది.. ఇది ఆ రెండు సెగ్మెంట్ల‌లో వైసీపీ  దారుణమైన ఓట‌మి చ‌విచూసింది. ఆ సెగ్మెంట్లు ఏమిటో కాదు - ఎక్క‌డో కాదు- జీరోస్దానాలు వైసీపీ సాధించుకున్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం - ఆచంట‌
 
 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ న‌ర‌సాపురం నుంచి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంట‌నే, జ‌గ‌న్ ఆయ‌న‌కు 2014 ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌డం జ‌రిగింది.. అలాగే ఆ ఎన్నిక‌ల్లో సీటు ఆశించిన ముదునూరి ప్ర‌సాద‌రాజు ఆచంట‌ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు.. చివ‌రకు ఇద్ద‌రూ ఓట‌మి పాల‌య్యారు.. అయితే త‌న ప్రాంతం కాక‌పోయినా అక్క‌డ నుంచి పోటీ చేయ‌డానికి ముదునూరి ప్ర‌సాద‌రాజు ముందుకు వెళ్ల‌డం, ఇక్క‌డ మెచ్చుకోవాల్సిన అంశం.
                       
అయితే జ‌గ‌న్ ఓట‌మితో తన సొంత‌గూటికి వెళ్లిపోయారు మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు.. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌స్తుంది అని అనుకున్నారు తెలుగుదేశంలో , కాని ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి వ‌రించ‌లేదు.. చివ‌ర‌కు ఆయ‌న పార్టీలోనే కొన‌సాగుతున్నారు.. అయితే ఇటు ఆచంట‌లో  వైసీపీ త‌ర‌పున క‌వురు శ్రీనివాస్ కు జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలాగే ముదునూరి ప్ర‌సాద‌రాజుకు న‌ర‌సాపురం సీటును క‌న్ఫామ్ చేశారు.. దీంతో వీరు ఇరువురు ఇక్క‌డ సెగ్మంట్లో కేడ‌ర్ తో ముందుకు పోతున్నారు.
 
అలాగే ప‌క్క సెగ్మెంట్ పాల‌కొల్లులో కూడా ఇరువురు వైసీపీ కీల‌క నాయ‌కులు  ఉండ‌టంతో అక్క‌డ కూడా జ‌గ‌న్ స‌రికొత్త ప్లాన్ అమలు చేశారు.. గుణ్ణం నాగ‌బాబుకు పాల‌కొల్లు వైసీపీ ఇంచార్జ్ గా బాధ్య‌తలు ఇచ్చారు, అలాగే మేకా శేషుబాబును రాష్ట్ర కార్య‌వ‌ర్గంలోకి తీసుకున్నారు జ‌గ‌న్.. ఇక్క‌డ కూడా పార్టీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళుతోంది వైసీపీ.. ఇప్పుడు పాల‌కొల్లులో గుణ్ణం నాగ‌బాబు ఓసారైనా ఎమ్మెల్యే అయి ప్రజా సేవ‌చేయాలి అనే త‌లంపుతో ఉన్నారు.. 
 
అలాగే ఆచంట‌ వైసీపీ త‌ర‌పున ఉన్న క‌వురు కూడా ఎమ్మెల్యే అవ్వాలి అని జిల్లాలో సెగ్మెంట్ కు బ్రాండింగ్ తేవాలి అని భావిస్తున్నారు.. ఇక న‌ర‌సాపురంలో బండారు మాధ‌వ‌నాయుడు తెలుగుదేశం త‌ర‌పున ఎమ్మెల్యేగా ఉన్నారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు బాబు సీటు ఇస్తారా లేదా?  కొత్త‌ప‌ల్లికి సీటు ఇస్తారా?  అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
 
ఇటు పాల‌కొల్లులో ఎమ్మెల్యే రామ‌నాయుడికి తెలుగుదేశంలో పోటీ లేరు, అటు ఆచంట‌లో మంత్రి పితాని స‌త్య‌నారాయ‌న‌కు కూడా ఎవ‌రూ పోటీ లేరు.. దీంతో పార్టీ త‌ర‌పున పాలకొల్లు ఆచంట‌లో టీడీపీలో వ‌ర్గ పోరు లేదు. అందుకే జ‌గ‌న్ ఇక్క‌డ సీట్లు ముందుగానే ఫైన‌ల్ చేశారు అని తెలుస్తోంది.. మొత్తానికి గ‌తంలో కంటే ఈ సారి ముందుగానే వైసీపీ నాయ‌కులు మేల్కొన్నారు అంటున్నారు జిల్లా సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.