విశాఖ సాక్షిగా జ‌గ‌న్ అదిరిపోయే రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan padayatra
Updated:  2018-08-24 05:06:18

విశాఖ సాక్షిగా జ‌గ‌న్ అదిరిపోయే రికార్డ్

మ‌రికొద్ది రోజుల్లో మ‌నంద‌రి ప్ర‌భుత్వం రాబోతుంది. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తీ ఒక్క‌రి ముఖంలో చిరున‌వ్వు తెస్తాను, గ‌తంలో రాజన్న ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపించారో తాను కూడా అదే రీతిలో న‌డిపిస్తాను.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆరోగ్య శ్రీ కార్డ్ ఉంటే చాలు ఎలాంటి రోగం అయినా ఫ్రీగా చేయించుకునేలా చేస్తాను, మ‌హిళ‌ల‌కు అండ‌గా, రైతన్న‌ల‌కు తోడుగా ఉంటాన‌ని కొండంత భ‌రోసా ఇస్తున్నారు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి.
 
ఆయ‌న‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం 2014లో టీడీపీకి కంచుకోట‌గా మారిన‌ విశాఖ‌ ప‌ట్నంలోని య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌య‌త్ర‌లో జ‌గ‌న్ ప్రజా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ మేనిఫెస్టోలో వాట‌న్నింటిని చేర్చుతూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. 
 
తాజాగా ఈ సంక‌ల్ప‌యాత్ర మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. జ‌గ‌న్ య‌ల‌మంచిలికి చేరుకోగానే ఈ పాద‌యాత్ర 2800 కిలో మీట‌ర్ల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ య‌ల‌మంచిలో పాద‌యాత్ర‌కు గుర్తుగా ఒక మొక్క‌ను నాటి పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత య‌ల‌మంచిలిలో పార్టీ నాయ‌కులు ఏర్పాటు చేసిన భారీ భ‌హిరంగ స‌భ‌లో పాల్గొని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌క‌లు చేస్తున్న అవినీతి అరాచకాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.