ప్రజాసంక‌ల్ప‌యాత్ర‌కు బ్రేక్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-28 01:26:29

ప్రజాసంక‌ల్ప‌యాత్ర‌కు బ్రేక్...

ఏపీకి ప్ర‌త్యేక హూదా ప్ర‌క‌టించాలని ప్ర‌త్యేక హూదా సాధ‌న కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. పార్ల‌మెంట్లో ఏపీకి ప్ర‌త్యేక హూదా పై వైసీపీ పోరాటం ఉథృతం చేయ‌నుంది. ..ఇక మార్చి 1న క‌లెక్ట‌రేట్ల ముట్డ‌డికి వైసీపీ పిలువునిచ్చిన విష‌యం తెలిసిందే.
 
పార్లమెంట్‌ సమావేశాలు పునఃప్రారంభమయ్యే మార్చి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా తదితర రూపాల్లో నిరసన చేపట్టనుంది వైసీపీ.. ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హూదా సాధ‌నకై త‌న పాద‌యాత్ర‌కు రేపు బ్రేక్ ఇచ్చారు.. గురువారం ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ఆయ‌న బ్రేక్  ఇస్తున్నారు.. గురువారం హైద‌రాబాద్ రానుండ‌టంతో  ఇక శ‌నివారం ఆయ‌న  పాద‌యాత్ర చేయ‌నున్నారు.
 
హోదా సాధనే ఏకైక డిమాండ్‌తో మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ క్యార్యక్రమంలో పాల్గొననున్నారు.. అందుకే పార్టీ అధినేత గా ఉన్న జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు  రేపు విరామం ఇవ్వాలి అని భావించారు.
 
ముందు చెప్పిన విధంగానే పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో విడత సమావేశాల్లో పాల్గొనేందుకుగానూ, మార్చి3న వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలకు సైతం సిద్ధమని ప్రకటించిన ఎంపీలు..... పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిసి,దిల్లీకి  ఎంపీలు బయలుదేరనున్నారు... ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు నుంచి ఢిల్లీ వెళ్లే నేతల వాహన శ్రేణిని జగన్‌ జెండా ఊపి పంపనున్నారు.
 
ఇక ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా పార్లమెంట్‌ సమావేశాలు పునఃప్రారంభమయ్యే రోజునే ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. జంతర్‌మంతర్‌ వేదిక వద్ద జరిగే ధర్నాలో ఎంపీలతోపాటు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటారని వైసీపీ తెలియ‌చేసింది.. మొత్తానికి మార్చి నెల‌లో వైసీపీ త‌ర‌పున ప్ర‌త్యేక హూదా కోసం పోరాటం చేయ‌డానికి ప్ర‌తిప‌క్షం వైసీపీ రెడీ అయింది.. ఇక తెలుగుదేశం మాత్రం దీనిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.