కాపులకు బంప‌ర్ ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 16:10:22

కాపులకు బంప‌ర్ ఆఫ‌ర్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహన్ రెడ్డి పాద‌యాత్ర ప‌శ్చిమ‌గోదావ‌రి నుంచి తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ఎంట‌ర్ అవుతోంది.. ముఖ్యంగా ఇక్క‌డ కుల స‌మీక‌ర‌ణాలు ప‌రిశీలిస్తే, గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ రైతురుణ మాఫీ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం త‌న ఓట‌మికి ఓ ప్ర‌ధాన కార‌ణం అయితే, త‌ర్వాత ఇక్క‌డ ఎక్కువ‌గా కాపు ఓటు బ్యాంకును కోల్పోయారు..కాపులకు రిజ‌ర్వేష‌న్లు అనే అంశంతో తెలుగుదేశం పార్టీ ప‌వ‌న్ ని తెర‌ముందు తీసుకువ‌చ్చి మోదీ ప‌వ‌న్ తో ప్ర‌చారాలు చేసి గెలుపొందింది.. 
 
అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపుల‌కు ఎటువంటి హామీలు నెర‌వేర్చ‌లేదు.. జిల్లాలో హోం మంత్రి ఉన్నా ఆయ‌న కాపుల‌కు ఇచ్చిన హామీలు అన్ని నెర‌వేర్చాము అని అంటున్నారు... అయితే తెలుగుదేశం పార్టీ పై ఇక్క‌డ కాపుల్లో మ‌రింత వ్య‌త‌రేక‌త పెరిగింది.. తుని ఘ‌ట‌న త‌ర్వాత ఇక్క‌డ మ‌రింత పోరు పార్టీపై వ్య‌తిరేక‌త తీవ్ర‌స్దాయిలో రాజుకుంది..
 
ఇక ముద్ర‌గ‌డలాంటి కాపు ఉద్య‌మ నాయ‌కుడిపై దాడి కుటుంబం పై అమానుషంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఇవ‌న్నీ కాపుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయి. సంఘాలు స‌మావేశ‌మై అనేక కార్య‌క్ర‌మాలు చేశారు.. తెలుగుదేశం పై వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా అల‌జ‌డి సృష్టించారు.. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ ఇక్క‌డ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల పై ఎటువంటి స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌డం లేదు.
 
ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర తూర్పుగోదావ‌రిలో నేటి నుంచి జ‌రుగుతుండ‌టంతో ఇక్క‌డ కాపులు అంద‌రూ జ‌గ‌న్ ఎటువంటి హామీ కాపుల‌కు ప్ర‌క‌టిస్తారా అని చూస్తున్నారు... ఇప్ప‌టికే కాపు కార్పొరేష‌న్ తెలుగుదేశం ప్ర‌క‌టించింది, అయితే వైసీపీ స‌రికొత్త హామీ కాపుల‌కు ఏమి ఇస్తుంది  ఓ నిర్దిష్ట స‌మ‌యంలో కేంద్రంతో  చ‌ర్చించి కాపుల రిజ‌ర్వేష‌న్ బిల్లు అమ‌లు చేసేలా ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ చేయ‌నున్నారు అనే వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది... ముఖ్యంగా కాపు యువ‌త ఇదే అంశంతో సోష‌ల్ మీడియాలో కూడా పోస్టులు వైర‌ల్ చేస్తున్నారు... మ‌రి చూడాలి జ‌గ‌న్ కాపుల‌కు ఎటువంటి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టిస్తారో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.