దేవినేనికి న‌లుదిక్కుల జ‌గ‌న్ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-16 15:43:36

దేవినేనికి న‌లుదిక్కుల జ‌గ‌న్ చెక్

ఎపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తుంటారు. పులివెందుల‌లో టీడీపీ గెలుస్తుంది. వైఎస్ ఘోర ప‌రాజ‌యం ఎదుర్కోవ‌డం ఖాయం, పులివెందుల ఫ్యాక్ష‌న్, తుని ఘ‌ట‌న‌లో చంద్రబాబా నాయుడు పులివెందుల‌కు చెందిన వ్య‌క్తులు ఉన్నారు అంటే... అవును ఇలాంటి ఘ‌న‌ట‌ను చేసేది కేవ‌లం పులివెందుల ప్ర‌జ‌లు మాత్ర‌మే అంటూ... ఉన్న‌ది లేనిది సృష్టించి నిరంత‌రం ఉమా త‌న అనుకూల మీడియా ద్వారా విమ‌ర్శ‌లు చేస్తుంటారు. 
 
ఇక ఆయ‌నను ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించాల‌ని ఉద్దేశంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌రికొత్త ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగానే దేవినేనికి స‌రైన పోటీ వ్య‌క్తి వ‌సంత‌ను వైసీపీలో చేర్చుకున్నారు. ఆయ‌న ఎప్పుడు అయితే పార్టీ తీర్థం తీసుకున్నారో అప్ప‌టినుంచి వైసీపీ మైల‌వ‌రంలో యాక్టివ్ గా క‌నిపిస్తోంది. ఆర్థికంగా, వ్యాపార వేత్త‌గా స్థిరప‌డిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ సామాజికంగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆయ‌న నివాసానికి ఎవ‌రైనా ఒట్టి చేతుల‌తో వెళ్తే తిరిగి వెళ్లేట‌ప్పుడు ఏదో ఒక‌టి చేత ప‌ట్టుకు పోవాల్సిందే. 
 
ఇక ఆయ‌న త్యాగాన్ని చూసిన ప్ర‌జ‌లంద‌రు వ‌సంత‌ వెన్నంటి న‌డుస్తున్నారు. దీంతో మైల‌వ‌రంలో వైసీపీ ఊపు మ‌రింత పెరిగింది. ఇక ఇదే  క్రమంలో వైసీపీ నాయ‌కులు పార్టీ త‌ర‌పున నియోజ‌క‌వ‌ర్గంలో ఒక కార్య‌క్ర‌మం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య నేత‌గా వైవీ సుబ్బారెడ్డి విచ్చేశారు. ఈ స‌మావేశంలో పార్టీకి సంబంధించిన దిశా నిర్ధేశాల‌ను చ‌ర్చించారు. హోరా హోరీగా జ‌రిగే ఎన్నికల్లో వ‌సంత‌ను గెలిపించ‌వ‌ల‌సిన ఆవ‌స్య‌క‌త‌ ఎంతైనా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అసలు వైసీపీ అడుగు పెట్టలేదు అనుకున్న నియోజకవర్గం మైలవరం. అలాంటి చోట ఇప్పుడు వైసీపీకి గట్టి ఊతమే లభిస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.