జ‌గ‌న్ ఇమేజ్ మ‌రింత పెరిగింది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 11:42:00

జ‌గ‌న్ ఇమేజ్ మ‌రింత పెరిగింది

యుద్దంలో గెల‌వాలి.. ఇంకా ఆ యుద్దానికి సంవ‌త్స‌రం స‌మ‌యం ఉంది.. కానీ  స‌మ‌రానికి శంఖం పూరిస్తున్నాయి ఏపీలో ఇరు రాజ‌కీయ పార్టీలు... సంక్రాంతి బ‌రిలో నిలిచే పందెంకోళ్ల‌లా ఎన్నిక‌ల బ‌రిలో గెల‌వడానికి ఇప్ప‌టి నుంచే రెడీ అవుతున్నాయి పార్టీలు... ఇటు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ప్ర‌జాక్షేత్రంలో క‌దం తొక్కుతున్నారు.
 
అధికారంలో ఉన్నా నాయ‌కుడు, తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు కేంద్రం పై పోరాడుతున్నార‌ని... ఏపీకి నిధులు ఇవ్వాలి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలి అని గొంతెత్తుతున్నార‌ని,  తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు.. అయితే ఈ నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో,  తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి ప్రెజ‌ర్ లేదు కాబ‌ట్టే కేంద్రం కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వెన‌క‌డుగువేసింది.
 
ప్యాకేజీతో స‌రిపెట్టుకోమంది.. ఓ ప‌క్క వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తే, రాజ‌కీయం కోసం జ‌గ‌న్ ఇవన్ని చేస్తున్నారు అని కామెంట్లు చేశారు.. చివ‌ర‌కు తెలుగుదేశం ఈ నాలుగు సంవ‌త్స‌రాల‌లో చేసింది ఏమిటి?  జ‌గ‌న్ ను విమ‌ర్శించ‌డం మాత్ర‌మే, ఓ ప‌క్క కేంద్రం నిధులు ఇచ్చాము అంటుంటే, వాటిని ఖ‌ర్చుపెట్టిన దానికి లెక్కలు చూప‌డం లేదు ఇటు తెలుగుదేశం.. సో ఇక్క‌డ కేంద్రం ఏపీకి అందుకే ఎటువంటి నిధులు కేటాయించ‌డం లేదు అనేది స్ప‌ష్టం అయింది.
 
ఇక జ‌గ‌న్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చాలా క్రిస్ట‌ల్ క్లియ‌ర్ గా చెప్పారు.. ఏపీకి ఎటువంటి అన్యాయం జ‌రిగినా ఊరుకోము. అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తేనే బీజేపీతో క‌లిసి ప‌నిచేస్తాము అని తెలిపారు.. అయితే జ‌గ‌న్ చెప్పిన దానికి తెలుగుదేశం అనేకానేక కామెంట్లు చేసింది.. జ‌గ‌న్ బీజేపీతో పొత్తుకు ఉవ్విళ్లూరుతున్నారు అని కామెంట్లు చేసింది. చివ‌ర‌కు జ‌గ‌న్ చెప్పింది క‌రెక్ట్ అయింది.. ఇంత రాద్దాంతం చేస్తున్న తెలుగుదేశం బీజేపీకి క‌టీఫ్ అని చెప్పే దైర్యం చేయ‌లేక‌పోతోంది.
 
జ‌గ‌న్ ఒక్క‌మాట‌లో మా పొత్తు కావాలి, మా సాయం కావాలి అంటే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలి అని చెప్పారు. ఇంత‌కంటే ఏం కావాలి..? జ‌గ‌న్ ఒక్క‌మాట‌తో ఇటు రాజ‌కీయంగా హైలెట్ అయ్యారు... అటు తెలుగుదేశం అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా ఇరుక్కుంది. ప్లకార్డులు ప‌ట్టుకుంటూ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.