ప‌వ‌న్ కు బాబుకు జ‌గ‌న్ స‌వాల్ ? క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan chandrababupavan image
Updated:  2018-03-03 03:28:58

ప‌వ‌న్ కు బాబుకు జ‌గ‌న్ స‌వాల్ ? క్లారిటీ

వైయ‌స్సార్ సీపీ కేంద్రం పై ప్ర‌త్యేక హూదా ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసింది.. పార్టీ నాయ‌కులు ప్ర‌జాప్ర‌తినిధులు నేడు హ‌స్తిన వెళ్ల‌నున్నారు.. జ‌గ‌న్ వీరి వాహ‌న శ్రేణికి జెండా ఊపి దిల్లీ ధ‌ర్నాకు పంపించారు.. ఇక వైయ‌స్సార్ కాంగ్రెస్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంది అని అన్నారు.. వైయ‌స్సార్ సీపీ ఎంపీలు అనుకున్న విధంగా దిల్లీలో ఈ నెల 5 వ తేదిన ధ‌ర్నా చేయ‌నున్నారు. అలాగే పార్లమెంట్లో పోరాటం చేయ‌నున్నారు అని జ‌గ‌న్ తెలియ‌చేశారు.
 
20 మంది తెలుగుదేశం ఎంపీలు మ‌ద్ద‌తు ఇచ్చే బాధ్య‌త ప‌వ‌న్ బాబుదే అని అన్నారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్... ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై వేటు వేసే వ‌ర‌కూ అసెంబ్లీకి వెళ్లం అని క్లారిటీ ఇచ్చారు.. హూదా పోరాటం క్లైమాక్స్ ద‌శ‌కు చేరుకుంది అన్నారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన స‌ల‌హాతోనే అవిశ్వాస తీర్మానం చేప‌డుతున్నాం,  21 న కేంద్రం పై అవిశ్వాస తీర్మానం  పెడ‌తాం అని తెలియ‌చేశారు జ‌గ‌న్..... క‌చ్చితంగా ప‌వ‌న్ దీనికి స‌పోర్ట్ చేస్తారు అన్నారు.. కాబ‌ట్టి క‌చ్చితంగా తెలుగుదేశం ఎంపీల మ‌ద్ద‌తు ఇప్పించాలి అని అన్నారు.. ఇక కేంద్రంలో ప‌లు పార్టీల‌తో మాట్లాడ‌తా క‌ర్నాట‌క, త‌మిళ‌నాడు ఇత‌ర రాష్ట్రాలు కూడా వెళ్లి వారి మ‌ద్ద‌తు తీసుకువ‌స్తా అన్న ప‌వన్ దీనిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
 
ఇక జ‌గ‌న్ చెప్పిన విధంగా కేంద్రం పై అవిశ్వాసానికి రెడీ అయ్యారు.. మ‌రి నిన్న  మాట్లాడిన తెలుగుదేశం ఎంపీలు ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.. ఏపీ కోసం వీరు రాజీనామాలు చేస్తారా, లేదా పార్టీ కోసం ఓటుకు నోటు కేసు కోసం వెన‌క‌డుగు వేస్తారో ఇప్పుడు తెలిసిపోతుంది అంటున్నారు వైసీపీ నాయ‌కులు మ‌రి ఇదీ పాయింటే.
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.