బికాం లో ఫిజిక్స్ జ‌లీల్ పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan speech
Updated:  2018-04-15 01:27:24

బికాం లో ఫిజిక్స్ జ‌లీల్ పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర ప్ర‌స్తుతం తెలుగు దేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో అధికార బ‌లంతో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ... ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్..నిన్న కృష్ణా జిల్లాలో మొద‌లైన ఈ యాత్ర  13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు.
 
ఇక తాజాగా చిట్టిన‌గ‌ర్ లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ... అమ‌రావ‌తి నిర్మాణం పేరు చెప్పి ప్ర‌జ‌లవ‌ద్ద నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈక్ర‌మంగా భూములు లాక్కున్నార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్...అలాగే  2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు ఆరు వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యార‌ని అన్నారు... బాబు హ‌యాంలో ప‌విత్ర‌మైన దుర్గ‌మ్మ‌గుడిలో తాంత్రిక పూజలు చేయించిన ఘ‌నత మ‌న ముఖ్య‌మంత్రికే చెందుతుంద‌ని జ‌గ‌న్ తెలిపారు.
 
దీంతో పాటు రాష్ట్రాన్నే గ‌డ‌గ‌డ‌లాడించిన  సెక్స్‌రాకెట్ కూడా తెలుగు దేశం పార్టీ అధికారంలోనే జ‌రిగింద‌ని గుర్తు చేశారు జ‌గ‌న్ ..అలాగే ఇక్క‌డ అధికార బ‌లంతో ఎంపీ అక్ర‌మంగా బ‌స్సులు తిప్పుతార‌ని,  అక్ర‌మంగా తిప్పిన బ‌స్సుల‌ను  పోలీస్ అధికారులు అడ్డుకుంటే వారిపై  దౌర్జ‌న్యం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్...అందులో భ‌గంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై కూడా జ‌గ‌న్ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... వైసీపీలో అత్యధిక మెజారిటీతో గెలిచిన అభివృద్ది కోస‌మే జ‌లీల్ ఖాన్ టీడీపీ లోకి ఫిరాయించాన‌ని చెప్పార‌ని అయితే ఏ మాత్రం అభివృద్ది జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు... చిట్టిన‌గ‌ర్ లోనే జ‌లీల్ ఖాన్ బికాంలో ఫిజిక్స్ పూర్తి చేసుకున్నార‌ని అన్నారు.
 
కాగా  త‌మ పార్టీ ఎంపీలు రాజీనామాలుచేసి ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా  అమరణ నిరాహారదీక్ష చేస్తుంటే, టీడీపీ ఎంపీలు కనీసం రాజీనామాలు కూడా చేయకుండా ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని మండిప‌డ్డారు జ‌గ‌న్  ప్రత్యేకహోదాపై చంద్ర‌బాబు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటేత‌న పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమంలో రావాలని బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా జ‌గ‌న్ సూచించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.