జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-18 05:59:09

జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో భాగంగా  ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడారు. 
 
ప‌వ‌న్ కళ్యాన్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ   వ్య‌వ‌హారం కోడి గుడ్డు మీద ఈక‌లు పీకిన‌ట్లుందంటూ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ కళ్యాన్ , చంద్ర‌బాబు ఇప్పుడు చేయాల్సింది  కోడిగుడ్డు మీద ఈక‌లు పీకడం కాదు....రూపాయి, అర్ధ‌రూపాయి త‌క్కువ  ఇచ్చార‌ని  చెప్పి  ప్యాకేజీ కోసం  నానా యాగీ చేయ‌డం కాదు.....ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు  అని పోరాటం చేయాలని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. 
 
హోదా రాష్ట్రాన్ని విడ‌గొట్టేట‌పుడు మ‌న‌కు హ‌క్కుగా ఇచ్చారు...హోదా వ‌స్తేనే ప‌రిశ్ర‌మలు వ‌స్తాయి....హోదా వ‌స్తేనే ఇన్ క‌మ్ ట్యాక్స్ క‌ట్టాట్సిన అవ‌స‌రం లేదు...ఉద్యోగాలు వ‌స్తాయ్ అని జ‌గ‌న్ గుర్తు చేశారు. హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా సిద్ద‌మ‌ని జ‌గ‌న్ ప్ర‌కట‌న చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.