వీరిద్ద‌రి క‌ల‌యిక‌పై జ‌గ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and babu
Updated:  2018-11-03 12:10:35

వీరిద్ద‌రి క‌ల‌యిక‌పై జ‌గ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నైతిక విలువ‌లు, సిద్దాంతాలు లేవ‌ని ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. ఆయ‌న ఒక అవ‌కాశ‌వాద‌ని త‌న‌కు అవ‌సరం వ‌చ్చిన‌ప్పుడు ఇత‌ర పార్టీల‌తో చేతులు క‌ల‌ప‌డం అవ‌స‌రం లేన‌ప్పుడు ఆపార్టీని వ‌దిలేయ‌డం చంద్ర‌బాబుకు ఆన‌వాయితిగా పాటిస్తు వ‌స్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఈమేర‌కు జ‌గ‌న్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో ట్వీట్ కూడా చేశారు. 
 
ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అలాగే చంద్ర‌బాబు నాయుడు హ‌స్తిన సాక్షిగా క‌ల‌యికపై జ‌గ‌న్ స్పందిస్తూ... 1956 న‌వంబ‌ర్ 1న అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌రించిన రోజే చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాల‌ను విడ‌గొట్టిన శ‌క్తుల‌తో చేతులు క‌లిపార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. ఇదే క్ర‌మంలో 2014 ఎన్నికల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీతో చేతులు క‌లిపి త‌న అవ‌స‌రాల‌కు వాడుకున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. అంతేకాదు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం మోసం చేసినా కూడా వారితో చంద్ర‌బాబు కాపురం చేశార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. 
 
గ‌తంలో తెలుగు రాష్ట్రాల‌ను ముక్క‌లు చేసిన కాంగ్రెస్ పార్టీతో చంద్ర‌బాబు ఇప్పుడు చేతులు క‌లిపి వాడుకున్నారు అని జ‌గ‌న్ ఆరోపించారు. దేశం కోసం అనే పేరు చెప్పి మ‌ళ్లీ