బాబుకి జగన్ ప్రత్యేక గుర్తింపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 11:13:24

బాబుకి జగన్ ప్రత్యేక గుర్తింపు

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాళ్ళకి నేనున్నాను అనే భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు...ప్రస్తుతం జగన్ పాదయాత్ర సుమారు 1800 కిలోమీటర్లు పూర్తి చేసుకొని, కృష్ణ జిల్లాలో నూజివీడులో కొనసాగుతోంది...పాదయాత్రలో జగన్ టీడీపీ పైన, చంద్రబాబు పాలనపైన, జరుగుతున్న అవినీతిపైనా రోజు ఒక కథతో విరుచుకుపడుతున్నారు.
 
చంద్రబాబు అధికారంలోకి రావడానికి అన్ని వర్గాల వారికి, పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు, రైతుల నుండి ఉద్యోగులు నిరుద్యోగుల వరకు ఇలా అందరికి కలిపి సుమారు 600 పైగా హామీలను ఇచ్చారు... చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలను నెరవేర్చడానికి రోజుకి 26 గంటలు కష్టపడుతూ, 600 హామీలలో, ఒక మోస్తరుగా ఒక్క హామీని నెరవేర్చి మిగతా 599 హామీలను నెరవేర్చడానికి కృషిచేస్తున్నారని జగన్ అన్నారు.
 
సరే హామీలను పక్కనపెడదాం, రాష్ట్రా విభజన చట్టంలో మనకు రావాల్సిన హామీల కోసం నాలుగేళ్లుగా బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ సాధించడానికి శతవిధాలా కష్టపడుతూ విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కృషి చేస్తూ ముందుకువెళ్తున్నారు...ప్రత్యేక హోదా విషయంలోకి వస్తే ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టి, రోజుకు మాట చెప్పి ప్రజలను మోసం చేస్తూ ముందుకు వెళ్లారు...మళ్ళి ఎన్నికలు దగ్గరకు రావడంతో నాలుగేళ్లు సంసారం చేసిన తర్వాత స్వార్ధ రాజకీయాల కోసం విడాకులు తీసుకోని ప్రత్యేక హోదా కావాలని అంటున్నారు..మళ్ళి ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రత్యక హోదా కోసం అని నిరాహారదీక్ష పేరుతో 420 దీక్ష చేసారు.. ఇలా ప్రజల కోసం, రాష్ట్రా అభివృద్ధి కోసం రోజుకి 26 గంటలు కష్టపడుతున్న చంద్రబాబుకి తగిన గుర్తింపు వచ్చే ఎన్నికలలో ఇవ్వాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.