రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం జ‌గ‌న్ మ‌రో రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-09-24 16:27:26

రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం జ‌గ‌న్ మ‌రో రికార్డ్

ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సా కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఈ రోజు మ‌రో రికార్డును అధిగ‌మించింది. న‌వంబ‌ర్ 6, 2017న ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర నేడు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చేరుకోగానే 3000 వేల కీలో మీట‌ర్ల‌ను జ‌గ‌న్ పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌కు గుర్తుగా ఒక మొక్క‌ను నాటారు. అంతేకాదు త‌న యాత్ర‌ను గుర్తు చేస్తూ పైలాన్ని కూడా ఆవిష్క‌రించారు వైఎస్ జ‌గ‌న్.
 
 ప్ర‌జ‌ల కోసం వేసిన ఒక అడుగు ల‌క్ష‌లాది అడుగుల‌తో ప్ర‌తి ధ్వ‌నిస్తోంది. జ‌గ‌న్‌ కోసం చేసిన సంక‌ల్పం మ‌హా సంక‌ల్ప బ‌ల‌మై ఊరూ వాడా విస్త‌రిస్తోంది. అధికార బ‌లంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్దున్న స్వ‌రం ల‌క్ష‌లాది గొంతుల‌కు తెలియ‌జేస్తున్నారు జ‌గ‌న్. వ‌ణికించే చ‌లి, మండే ఎండ‌లు, జోరు వానల్లో పాద‌యాత్రికుని సంక‌ల్ప బ‌లం చెక్కు చెద‌ర‌లేదు.
 
గ‌త ఎడాది నంవ‌బ‌ర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభం అయిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర  ఈ రోజున విజ‌య‌న‌గ‌రం జిల్లా దేశ‌పాత్రుని పాలెంలో 3000 వేల కిలో మీట‌ర్ల మ‌హ‌జ్వ‌ల ఘ‌ట్టానికి చేరుకుంది. అయితే అంత‌కు ముందు ఉద‌యం విశాఖ జిల్లాలో మొద‌లైన 269న పాద‌యాత్ర చింత‌ల‌పాలేం వ‌ద్ద విజ‌య‌న‌గ‌రం జిల్లాలోకి ప్ర‌వేశించింది. సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ నేతృత్వంలో ప‌లువురు నేత‌లు వైఎస్ జ‌గ‌న్ కు అపూర్వ స్వాగతం ప‌లికారు. 
 
కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు..
0- వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయ 
500- అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు 
1000- నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు 
2000- పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి
2500- తూర్పు గోదావరి జిల్లా పసలపూడి శివారు 
3000- విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం 

షేర్ :

Comments

1 Comment

  1. Jai Jagan

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.