సెప్టెంబ‌ర్ 6న జ‌గ‌న్ మ‌న‌సు మార‌నుందా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan mohan reddy
Updated:  2018-08-29 04:10:09

సెప్టెంబ‌ర్ 6న జ‌గ‌న్ మ‌న‌సు మార‌నుందా

ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌న‌సు మారిందా ! అంటే అవున‌నే అంటున్నారు కొంద‌రు నాయ‌కులు. గ‌డిచిన ఏడాది క్రితం నుంచి ఆయ‌న అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌కుండా బైకాట్ చేస్తూ వ‌స్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాజ్యాంగానికి విరుద్దంగా త‌మ పార్టీ ఎమ్మెల్యేలను వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించ‌కుండా టీడీపీలో చేర్చుకున్నార‌ని, అయితే దీనిపై స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు జ‌గ‌న్. 
 
కానీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శీతాకాల స‌మావేశాల‌కు ఆ త‌ర్వాత జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల‌కు బైకాట్ చేసిన సంగ‌తి తెలిసిందే.  అయితే ఇదే క్ర‌మంలో వ‌చ్చే నెల 6న వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఈ స‌మావేశాల‌కు అధికార తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్ల‌ను సిద్దం చేసింది. ఇక ఈ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు పాల్గొంటాలేదా అన్న‌ది ఆస‌క్తి క‌రంగా మ‌రుతుంది. 
 
అయితే ఇదే విషయంమై పార్టీ నాయ‌కుల‌తో వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ స‌మావేశం కూడా విశాఖ ప‌ట్నంలో ఏర్పాటు చేన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కూడా ఇదే జిల్లాలో కొన‌సాగుతుండ‌టంతో వ‌చ్చే నెల 3వ తేదిన పార్టీ నాయ‌కులు కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.
 
అయితే ఈ సారి కూడా అసెంబ్లీ మావేశాల‌కు జ‌గ‌న్ బైకాట్ చేయ్యాల‌ని భావిస్తున్నారు కానీ కొంత‌మంది నాయ‌కులు స‌సేమిరా అంటున్నారు. ఎందుకంటే కొద్దికాలంగా అసెంబ్లీకి దూరంగా ఉండ‌టం వల్ల త‌మ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డానికి ఆస్కారం లేకుండా పోతుంద‌ని అంటున్నారు. 
 
ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో టీడీపీ నాయ‌కులు వైఫ‌ల్యాల‌ని ఎండ‌గ‌ట్టేందుకు ఈ చిన్న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుందామ‌ని స‌ల‌హా ఇస్తున్నారు.పైగా టీడీపీ నాయ‌కులు కూడా ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు అసెంబ్లీకి రాకుండా విఫ‌లంల అయింద‌న్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి మ‌రి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.