టీడీపీ నాయ‌కుల్లో అల‌జ‌డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 07:45:48

టీడీపీ నాయ‌కుల్లో అల‌జ‌డి

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్రజాసంక‌ల్ప‌యాత్ర ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట కృష్ణా జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర్నాల‌ను ప్ర‌జ‌లుకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. ఇక దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ప‌రిపాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ స్పీడును పెంచారు. ఈ స్పీడుకు టీడీపీ నాయ‌కులు బెంబెలెత్తిపోతున్నారు. నాలుగేళ్లుగా అప‌ద్దాలు మోస‌పూరిత‌మైన వాగ్దానాలు చేస్తూ  సైకిల్ పార్టీ నాయ‌కులు కాలం గ‌డిపార‌ని జ‌గ‌న్ మండిప‌డుతున్నారు. అయితే వారి కాలానికి అడ్డుక‌ట్ట వేసే రోజులు ద‌క్క‌ర‌కు వ‌చ్చాయ‌ని, అధికారంతో ఎవ‌రెవ‌రు అవినీతికి పాల్ప‌డుతున్నారో వారంద‌రిని వైసీపీ అధికరంలోకి వ‌స్తే త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించారు. ఇక జ‌గ‌న్ హెచ్చ‌రిక, పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి టీడీపీ నాయ‌కులు భ‌య‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.
 
అయితే బ‌య‌ట‌కు మాత్రం టీడీపీ నాయ‌కులు ధైర్యంగా క‌నిపిస్తున్నా కానీ, లోప‌ల మాత్రం భ‌యాందోల‌న‌కు చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక మ‌రికొంద‌రు నాయ‌కులు అయితే ఏకంగా పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యార‌ని విస్య‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మొత్తానికి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా బీట‌లు వాలే ఛాన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలుపుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.