నేను బందీన‌య్యాను.. జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-09-20 05:48:19

నేను బందీన‌య్యాను.. జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా విశాఖ‌ప‌ట్నంలో సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో 116 నియోజ‌క‌వ‌ర్గాల‌ను 193 మండ‌లాల‌ను1650 గ్రామాల‌ను, అదేవిధంగా 44 మున్సిపాలిటీల‌ను, 106 స‌భ‌ల‌ను పూర్తి చేసుకున్నారు. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.
 
అయితే తాజాగా జ‌గ‌న్ త‌న సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఒక పోస్ట్ పెట్టారు..
tweet
 
పదేళ్ల శ్రీరామ్‌ పుట్టుకతోనే రెండు కళ్లూ లేని దివ్యాంగుడు. వెలుగు, చీకట్లు తెలియని పాపం పసివాడు. తన మనోనేత్రంతో నన్ను చూస్తూనే ఉన్నాడు. నేను బహిరంగ సభలలో మాట్లాడే మాటల్ని పొల్లుపోకుండా చెప్పాడు. నా హావభావాల్ని అద్భుతంగా ప్రదర్శించాడు. అంతులేని అభిమానం ఉంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. ఆ చిన్నారి ప్రేమకు బందీనయ్యాను.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.