జ‌గ‌న్ కొత్త టార్గెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-05 15:08:40

జ‌గ‌న్ కొత్త టార్గెట్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌స్తుతం కృష్ణాజిల్లాలో కొన‌సాగుతోంది.. ఇక ఆయ‌న పాద‌యాత్ర త‌దుప‌రి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించ‌నుంది... ముఖ్యంగా జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర రూట్ మ్యాప్ కూడా అన్ని సెగ్మెంట్ల మీదుగా విడుద‌ల అయింది... గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీకి విజ‌యం వ‌రించ‌లేదు.. ఒక్క‌సీటు కూడా వైసీపీ జిల్లా నుంచి గెలుచుకోలేదు.
 
దీంతో జిల్లాలో వైసీపీ జెండా కాస్త రెప‌రెప‌లాడించ‌డం క‌ష్టం అనే వార్త‌లు వినిపించాయి... అయితే తెలుగుదేశం పై ఎన్న‌డూ లేనంత‌గా వ్య‌తిరేక‌త పెరిగింది... ముఖ్యంగా ఆక్వాఫుడ్ ఫ్యాక్ట‌రీ వివాదం. ఇక ద‌ళితుల‌కు సంబంధించిన గ‌ర‌గ‌ప‌ర్రులో జ‌రిగిన వివాదం మొత్తం తెలుగుదేశం ఏ విషమంలోనూ ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయలేదు అని, స్ధానిక ఎమ్మెల్యేలు కూడా మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్ట‌రీ పై  ప్రేమ చూపుతున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
ఇక జిల్లాలో జ‌గ‌న్ కాపుల‌ను ఆక‌ర్షించాలి.... మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ కాపు నాయ‌కులు ఇరు పార్టీలో మెజార్టీ గా నాయ‌కత్వం వ‌హిస్తున్నారు... ఇక ఇక్క‌డ రాజ‌కీయం కూడా వీరి చుట్టూ తిరుగుతుంది... గ‌త ఎన్నికల్లో ప‌వ‌న్ చెప్పిన‌ట్లు విన్న కాపులు తెలుగుదేశానికి చాలా వ‌ర‌కూ ఓట్లు వేశారు... అయితే ఈ ఎన్నిక‌ల్లో వారు ఎవ‌రి వైపు వెళ‌తారో చూడాలి.
 
ఇటు తూగోలో కూడా రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది... అయితే జ‌గ‌న్ ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన ప్ర‌సంగాల‌కు కాస్త మార్పులు చేర్పులు చేస్తారు అని అంటున్నారు... ఎందుకంటే గ‌తంలో ఈ జిల్లాలో వైసీపీ 8 సీట్లు గెలుచుకుంటుంది అనుకుంటే, ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు..... దీంతో ఈ జిల్లా పై జ‌గ‌న్ ఇప్ప‌టికే రూట్ మ్యాప్ సిద్దం చేయించారు. 
 
వైసీపీ  జిల్లా పరిశీలకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని, నర్సాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నర్సింహరాజు తదితరులురూట్‌మ్యాప్‌పై కన్వీనర్లతో చర్చించారు ఫైన‌ల్ గా రూట్ మ్యాప్ సిద్దం చేశారు.. ఇక ఈ నెల 14 న వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర జిల్లాలోకి ప్ర‌వేశించ‌నుంది. ఇక జ‌గ‌న్ ఇక్క‌డ ఎటువంటి స్ట్రాట‌జీ అమ‌లు చేస్తారో జిల్లాలో చూడాలి.

షేర్ :

Comments

1 Comment

  1. I love you Jagan The Tiger. I am ready to come for the battle with the tiger Jagan brother... I will sacrifice my life to the party with Jagan Anna. I am ready for your words for do are die.

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.