జ‌నంలో జ‌న‌నేత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy prajasankalpa yatra
Updated:  2018-04-21 06:02:08

జ‌నంలో జ‌న‌నేత‌

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశంపార్టీ నాయ‌కుల కంచుకోట అయిన కృష్ణా జిల్లా నూజివీడు సెగ్మెంట్ లో ఈ రోజు నిర్విరామంగా కొన‌సాగుతోంది... ఈ సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా  బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుకుంటూ.. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అధికార బ‌లంతో చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను వివ‌రిస్తూ  వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో అశేష జ‌న‌వాహిని మ‌ధ్య‌లో జ‌న‌నేత జ‌గ‌న్ న‌డిచి వ‌స్తుంటే ఆయ‌న‌ను గుర్తు ప‌ట్ట‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని అనేక చోట్ల చ‌ర్చించుకుంటున్నారు... మ‌హానేత డా..రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర్వాత ఇంత జ‌నాన్ని జ‌గ‌న్ సంక‌ల్ప‌యాత్ర‌లో చూస్తున్నామ‌ని అంటున్నారు... ఏది ఏమైనా కానీ జ‌న హృద‌యాల‌ను సొంతం చేసుకునే త‌త్వం వైఎస్ కుటుంబానికి త‌ప్ప మ‌రే కుటుంబానికి లేద‌ని అంటున్నారు. 
 
జ‌న నేత జ‌గ‌న్ కు, నాడు వైయ‌స్ ఆర్ కు ఎంత పేరు వ‌చ్చిందో అంత‌కంటే రెట్టింపుగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో వ‌స్తోంది అని అంటున్నారు... వైయ‌స్సార్ హయాంలో జ‌రిగిన అభివృద్ది ఈ నాలుగేళ్ల‌ల్లో తెలుగుదేశం స‌ర్కారు సాధించ‌లేక‌పోయింది అని, ఆయ‌న ప‌థ‌కాల‌ను కూడా స‌క్ర‌మంగా చేయ‌లేక‌పోతున్న తెలుగుదేశం స‌ర్కారు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసింది అని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.. దీక్ష‌ల‌కు జ‌నాల‌ని ఆర్టీసీ బ‌స్సుల్లో త‌ర‌లించ‌డం కాదు?  జ‌గ‌న్ కు ఎలా ప్ర‌జ‌లు స్వ‌తంత్రంగా వ‌స్తున్నారో అలా రావాలి.. సీఎం దీక్ష‌లకు ఆర్టీసీ బ‌స్సులు ప్రైవేటు బ‌స్సుల్లో ప్ర‌జ‌లతో  నిన్న వంద‌లాది బ‌స్సులు క‌దిలాయి అని విమ‌ర్శిస్తున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.