బాల‌య్య‌ పై జ‌గ‌న్ కొత్త అస్త్రం?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan image
Updated:  2018-05-02 10:40:39

బాల‌య్య‌ పై జ‌గ‌న్ కొత్త అస్త్రం?

జ‌గ‌న్  కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర మండుటెండ‌లో జ‌రుగుతోంది.. ఇక 12 గంట‌ల దీక్ష కూడా చ‌ల్ల‌గా ఏసీలో చేసిన  తెలుగుదేశం నాయ‌కులు జ‌గ‌న్ ని విమ‌ర్శించ‌డ‌మా అని కూడా తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయిన విష‌యం నంద‌మూరి తార‌క‌రామారావు పేరును కృష్ణా జిల్లాకు పెడ‌తాము అని చెప్ప‌డం... దీనిపై  ఇప్పుడు హ‌ర్షం ఎలా వ్య‌క్తం అవుతుందో అలాగే వ్య‌తిరేక‌త కూడా వ‌స్తోంది కొంద‌రి నుంచి... ముఖ్యంగా  అది ప్ర‌జ‌ల నుంచి కాదు మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం వెన‌కాల ఉండి చ‌క్రాలు తిప్పే నాయ‌కుల నుంచి వారి స‌పోర్ట‌ర్స్ నుంచి .. అయితే ఒక‌వేళ తెలుగుదేశం నాయ‌కుల నుంచి ఈ వ్య‌తిరేకత వ‌స్తే జ‌గ‌న్ మ‌రింత దూసుకుపోతాడు... అందుకే ఆ ఛాన్స్ జ‌గ‌న్ కు ఇవ్వ‌కూడ‌దు అని జ‌స్ట్ వెనుక ఉన్న నాయ‌కుల చేత ఇలాంటి విమ‌ర్శ‌లు  చేయిస్తున్నారు అని అంటున్నారు.
 
తాజాగా దీనిపై సీఎంగాని ఆ గ్రామాన్ని దత్త‌త తీసుకున్న మంత్రి నారా లోకేష్ ఎటువంటి కామెంట్ చేయ‌లేదు.. దీంతో ఇప్పుడు అందరూ ఇదే చ‌ర్చించుకుంటున్నారు... అయితే నంద‌మూరి వార‌సులుగా చెప్పే బాల‌య్య ఎమ్మెల్యేగా ఉండి కూడా దీనిపై మాట్లాడ‌లేదు, మాట్లాడితే అధికారంలో ఉండి మీరు ఎందుకు ఇటువంటి ఆలోచ‌న  చేయ‌లేదు అని అంటారు అనే చ‌ర్చ జ‌రుగుతోంది.
 
ఇక కృష్ణా జిల్లాలో జ‌గ‌న్ ప్ర‌ముఖ సామాజిక వ‌ర్గం పై నేరుగా టార్గెట్ పెట్టారు... వారిని పార్టీలోకి రావాలి అని కోరుతున్నారు... ముఖ్యంగా అందులో భాగంగా జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా దీనిపై ఎఫెక్ట్ చూపించ‌నుంది... తెలుగుదేశం ఆ నాడు తొమ్మిదేళ్లు, ఈనాడు నాలుగేళ్లు ఎన్టీఆర్ పేరు ఎక్క‌డా క‌నిపించ‌కుండా చేస్తోంది అనే విమ‌ర్శ ఏనాటి నుంచో ఉంది... చంద్ర చంద్ర‌న్న అనే పేరుతోనే ముందుకు వెళుతోంది సైకిల్ పార్టీ... దీంతో తెలుగుదేశం నాయ‌కులు ఆనాటి సీనియ‌ర్లు కూడా మ‌ద‌న ప‌డుతున్నారు... అయితే పార్టీ త‌ర‌పున హ‌ర్షం చెప్ప‌క‌పోయినా దీనిపై జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు అంటున్నారు.
 
ఇప్పటికే అనేక సార్లు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అని విజ్ఞప్తులు చేయడంతో పాటు కొత్త రాజధాని నిర్మిస్తున్న ప్రాంతానికి అమరావతి బదులు ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని ఎందరో విజ్ఞప్తులు చేసినా తెలుగుదేశం  ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి.. ఇక తెలుగుదేశం పై న‌మ్మకం కూడా లేదు అని ఈ విష‌యంలో వారు చెబుతున్నారు.... మొత్తానికి జ‌గ‌న్ ఈ మాట చెప్ప‌డం పై బాల‌య్య ఎటువంటి స‌మాధానం చెప్ప‌లేకుండా ఉన్నారు అని అంటున్నారు..... ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు మంత్రి నారా లోకేష్ కంటే ఎక్కువ‌గా బాల‌య్య దీనిపై ఎలా స్పందిస్తారా అని వెయిట్ చేస్తున్నారు... మ‌రి చూడాలి జ‌గ‌న్ బాల‌య్య పై వేసిన అస్త్రం ఎలా మారుతుందో.. 
 
 

షేర్ :

Comments

1 Comment

  1. Next cm jagan

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.