జ‌గ‌న్ ఆ విష‌యం పై మ‌రింత ఫోక‌స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 15:33:23

జ‌గ‌న్ ఆ విష‌యం పై మ‌రింత ఫోక‌స్ ?

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకునే నిర్ణ‌యాలు పార్టీలో ఎంతో జోష్ తీసుకువ‌స్తున్నాయి... ముఖ్యంగా నాయ‌కుల‌కు జ‌గ‌న్ సీట్ల పై హామీ అదే విధంగా నాయ‌కుల‌కు తమ పార్టీ త‌ర‌పున ఎటువంటి ప‌ద‌వి ఇస్తామో ముందుగానే చెబుతున్నారు.
 
అదే హామీతో పార్టీలో చేరుతున్నారు నాయ‌కులు.అయితే ఇటు జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో పాద‌యాత్ర‌లో ఉన్నా ఇటు ఎన్నిక‌ల‌ మేనేజ్మెంట్ పై మ‌రింత శ్ర‌ద్ద పెట్టాల్సి ఉంది.. ఈ శ్ర‌ద్ద పెడితేనే ఇక్క‌డ ఎన్నిక‌ల్లో  అన్నింటా  దూసుకువెళ్ల‌గ‌ల‌మ‌ని చెబుతున్నారు పార్టీ శ్రేణులు.
 
ఇప్ప‌టికే బూత్ లెవెల్ నాయ‌కుల‌తో పార్టీలో క్రియాశీల‌కంగా ముందుకు వెళుతున్నారు జ‌గ‌న్... ఇక తాజాగా జ‌గ‌న్ ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు, కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.. బూత్ లెవ‌ల్లో ప‌ట్టు సాధించుకోవ‌డానికి వైసీపీ మ‌రింత కృషి చేయాల్సి ఉంది.
 
ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీకి మైలేజ్ తీసుకువ‌స్తున్నా,  గ్రామ‌స్ధాయిల్లో వైసీపి మ‌రింత బ‌లంగా మారేందుకు మ‌రింత గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డాల్సిందే.... ఇక జ‌గ‌న్ కు ఇక్క‌డ  బూత్ లెవ‌ల్ లో పార్టీ ప‌టిష్టంగా మారాలి.
 
ఇక గ్రామాల్లో వైసీపీ బ‌లోపేతానికి కృషిచేస్తున్నా, కొన్ని చోట్ల అల‌స‌త్వం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎమ్మెల్యేలుగా ఉన్న నాయ‌కులు మ‌రింత శ్ర‌ద్ద పెట్టాల్సి ఉంది.. అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ కీల‌క స‌మావేశంలో ఇదే విష‌యం నాయ‌కుల‌కు స్ప‌ష్ట‌త ఇచ్చార‌ని తెలుస్తోంది.. గ్రామాల్లో మ‌రింత ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని త‌న ప్లాన్ ని వివ‌రించారు అని పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.