బాబు కంచుకోట‌లో జ‌గ‌న్ స్కెచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 02:44:19

బాబు కంచుకోట‌లో జ‌గ‌న్ స్కెచ్

తెలుగుదేశం అధినేత కంచుకోట‌గా త‌న సొంత జిల్లా చిత్తూరును చెబుతూ ఉంటారు.. చిత్తూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగుతున్న స‌మ‌యంలో కూడా, జిల్లాలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకోవాలి అని తెలుగుదేశం తహ త‌హ‌లాడింది..అయితే టీడీపీ ఎత్తులు పాచిక‌లు పార‌లేదు చిత్తూరు జిల్లాలో.. సికే బాబు వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేర‌డంతో కూడా ఇక్క‌డ రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

అయితే జ‌గ‌న్ మాత్రం క‌డ‌ప జిల్లా, క‌ర్నూలు జిల్లా, త‌ర్వాత చిత్తూరు జిల్లా పై ఫోక‌స్ చేశారు.. వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా కంచుకోట‌లో ఫోక‌స్ చేయ‌డంతో ఇక్క‌డ రాజ‌కీయంగా పార్టీని మ‌రింత గాడిలోకి పెట్టాలి అని ఆలోచించారు... చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇక్క‌డ మొత్తం ప‌సుపు మ‌యం అవుతుంది అని గ‌త ఎన్నిక‌ల్లో నాయ‌కులు, తెలుగుతమ్ముళ్లు భావించారు.. కాని దీనికి ఉల్టాగా గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ 8 స్ధానాలు గెలుచుకుంది.. దీంతో ఇక్క‌డ తెలుగుదేశం కంటే వైసీపీ ఫాలోయింగ్ ఎక్కువ అనేది తేలిపోయింది. కేవ‌లం తెలుగుదేశానికి ఆరు స్ధానాలు మాత్ర‌మే వ‌చ్చాయి.. దీంతో జిల్లాలో తెలుగుదేశం గ్రాఫ్ ఎలా ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చు.. అయితే జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కులుగా చంద్ర‌బాబు - బొజ్జ‌ల గోపాల‌కృష్ణ ఉన్నారు.. మిగిలిన నాలుగు సీట్లు కూడా టీడీపీ ప‌వ‌నాలు ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండ‌టంతో గెలుపొందారు అనేది త‌మ్ముళ్ల అభిప్రాయం.

చిత్తూరులో ఆదికేశ‌వుల నాయుడు సానుభూతి ప‌వ‌నాల‌తో ఆయ‌న భార్య డీకే.స‌త్య‌ప్ర‌భ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక వైసీపీ నుంచి ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే అమ‌ర్నాథ్ రెడ్డిని తెలుగుదేశంలోకి తీసుకున్నారు సైకిల్ పార్టీ నాయ‌కులు.. ఎటు చూసినా జిల్లాలో వైసీపీకి ఇక్క‌డ ప్ల‌స్ అనేది తెలుస్తోంది..

జిల్లాలో వైసీపీ నాయ‌కులు తెలుగుదేశం నాయ‌కుల‌పై ఓ మెట్టు ఎక్కువే ఉన్నారు అని అంటున్నారు జిల్లాలో ప్ర‌జ‌లు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గ‌త ఎన్నిక‌ల మెజార్టీ ఫ‌లితాల స్పిరిట్ తో వైసీపీ గెలుపు త‌థ్యం అంటున్నారు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.