జ‌గ‌న్ అదిరిపోయే ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 12:07:59

జ‌గ‌న్ అదిరిపోయే ప్లాన్

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో దారుణ‌మైన పరాభ‌వం ఎదురు అయింది... అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్క‌డే తిరిగి పొందాలి అనేది రాజ‌కీయాల్లో ష‌రామాములే. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఏపార్టీ గెలుచుకుంటుందో ఆ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంది అనే సెంటిమెంట్ ఉంది.అయితే జ‌గ‌న్ ఇక్క‌డ జిల్లాల‌పై  పై మ‌రింత ఫోక‌స్ చేశారు. ఇక్క‌డ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న ఆళ్ల‌నానికి జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలాగే పీకే టీం కూడా ఇక్క‌డ నుంచే త‌న స‌ర్వే ప‌నుల‌కు మొద‌లుపెట్టింది.
 
గ‌త ఎన్నిక‌ల్లో చాలా పెద్ద త‌ప్పు చేసింది వైసీపీ. చివ‌ర్లో వైసీపీ అభ్య‌ర్దుల‌ను నిల‌బెట్ట‌డం స‌రైన అభ్య‌ర్దుల‌ను గుర్తించ‌క‌పోవ‌డం జిల్లాలో మైన‌స్ అయింది అని, వైసీపీ అధిష్టానం త‌ర్వాత పోస్టుమార్టంలో తెలుసుకుంది. ఇక ఏలూరు బాధ్య‌త‌ల‌ను గ‌తంలో సీనియ‌ర్ లీడ‌ర్ గా ఉన్న తోట చంద్ర‌శేఖ‌ర్ కు అప్ప‌గించారు. అయితే త‌ర్వాత మాజీ మంత్రి కోట‌గిరి త‌న‌యుడు శ్రీథ‌ర్ పార్టీలో చేరిన త‌ర్వాత ఏలూరు పార్ల‌మెంట్ బాధ్య‌త‌లు శ్రీథ‌ర్ కు అప్ప‌గించారు జ‌గ‌న్.తండ్రి విధ్యాధ‌ర‌రావు రాజ‌కీయంగా ఎంత ఫేమ‌స్సో ఆయ‌న త‌న‌యుడు శ్రీథ‌ర్ కూడా ఇక్క‌డ దూసుకుపోతున్నారు.                      
 
ఇక ఏలూరు అసెంబ్లీ పరంగా చూస్తే నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్‌గా మాజీ మునిసిప‌ల్ చైర్మ‌న్ మ‌ధ్యాహ్న‌పు ఈశ్వ‌రికి బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇటు ఎమ్మెల్యేగా ఉన్న బ‌డేటి బుజ్జికి స‌రైన ప్ర‌త్య‌ర్ధిగా సెల‌క్ట్ చేశారు జ‌గ‌న్.. ఇక ఏలూరు నుంచి ఆళ్ల నానికి జ‌గ‌న్ ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా ఇచ్చారు.. ఇక కొవ్వురు నుంచి తానేటి వ‌నిత త‌న కేడ‌ర్ తో మ‌రింత దూసుకుపోతున్నారు మంత్రి జ‌వ‌హ‌ర్  సెగ్మెంట్ కావ‌డం ఇటీవ‌ల వ‌స్తున్న వివాదాల‌తో తెలుగుదేశం ఇక్క‌డ కాస్త మైలేజ్ కోల్పోయింది.
 
ఇక గోపాలపురం నుంచి వెంక‌ట్రాపు త‌న దూకుడుతో ముందుకు వెళుతున్నారు. ఆర్ధికంగా బ‌లం కాక‌పోయినా కేడ‌ర్ విష‌యంలో ఆయ‌న ముందుకు వెళుతున్నారు. ఇక పాల‌కొల్లు నుంచి గుణ్ణం నాగ‌బాబు ఎమ్మెల్యే కావాల‌ని ఎప్ప‌టి నుంచో చూస్తున్నారు. గ‌తంలో వైయ‌స్ నుంచి హామీ వ‌చ్చినా, త‌ర్వాత జ‌గ‌న్ హామీ ఇచ్చినా సీటు మాత్రం ఇవ్వ‌లేదు. 2009 లో ఉషారాణి కోసం కాంగ్రెస్ లో సీటు వ‌దులుకుంటే, 2014 ఎన్నిక‌ల్లో శేషుబాబుకు సీటు ఇచ్చారు జ‌గ‌న్.  ఇక శేషుబాబుకు రాష్ట్ర‌కార్య‌వ‌ర్గంలో చోటు ఇచ్చి గుణ్ణం నాగ‌బాబుకు సీటు ఇచ్చారు.. ఇక నాగ‌బాబు ఫ్యామిలీ అక్క‌డ ఎమ్మెల్యే రామానాయుడుపై  తెలుగుదేశం స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో బాగానే వెళుతోంది.
 
ఇటు న‌ర‌సాపురంలో కొత్త ప‌ల్లి రూటు మార్చుకుని తెలుగుదేశంలోకి వెళ్ల‌డం చివ‌ర‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశిస్తే కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డం జ‌రిగింది... ఇక ఇక్క‌డ నుంచి మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజుకు జ‌గ‌న్ సీటు హామీ ఇచ్చారు... ఆయ‌న ఇక్క‌డ సెగ్మెంట్లో త‌న దూకుడు చూపుతున్నారు.. ఇటు ఆక్వా రంగంగా ప్ర‌సిద్దిచెందిన భీమ‌వ‌రంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ టికెట్ ఆఫ‌ర్ ఎప్పుడో ఇచ్చేశారు... ఆయ‌న పార్టీ త‌ర‌పున ఇక్క‌డ కృషిచేస్తున్నారు, ఇటు గంటా వియ్యంకుడు రామాంజ‌నేయులు ఎమ్మెల్యేగా భీమ‌వ‌రానికి చేసింది ఏమీ లేదు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు అభివృద్ది కుంటుప‌డింది అని ప్ర‌శ్నిస్తున్నారు.
 
ఇక చింత‌ల‌పూడిలో న‌లుగురు క‌న్వీనర్ల‌ను మార్చారు చివ‌ర‌కు ఇప్పుడు ఎలీషాను పెట్టారు... అయితే ఇక్క‌డ పార్టీ త‌ర‌పున కేడ‌ర్ బ‌లంగా ఉంది. అనేది వైసీపీ అస్త్రం. ఇక ఉండిలో అంతా తానై ఉండేవారు పాత‌పాటి స‌ర్రాజు మాజీ ఎమ్మెల్యే కావ‌డంతో జ‌గ‌న్ కూడా ఆయ‌న వైపు మెగ్గుచూపారు. అయితే ఆయ‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌డంతో అక్క‌డ బాధ్య‌త‌లు  కొత్త క‌న్వీన‌ర్‌గా న‌ర‌సింహారాజును ఎంపిక చేశారు. ఇక శివ‌కు బ‌లమైన అభ్య‌ర్ది అని ఇక్క‌డ ప్ర‌జ‌లు కూడా చ‌ర్చించుకుంటున్నారు.
 
ఇక ఆచంట‌లో ప్ర‌స్తుతం కౌరు శ్రీనివాస్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ముదునూరి పోటీ చేసినా ఆయ‌న న‌ర్సాపురం వెళ్ల‌డంతో కౌరుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మంత్రి పితాని పై ఇక్క‌డ వ్య‌తిరేక‌త తీవ్ర‌స్దాయిలో ఉంది అనేది ఇక్క‌డ వాద‌న‌.. ఇక దెందులూరు నుంచి కొఠారు త‌న‌యుడు విదేశాల నుంచి వ‌చ్చి చింత‌మ‌నేనికి ఓట‌మి రుచిచూపించ‌డానికి త‌న వంతు కృషి చేస్తున్నారు కొఠారు అబ్బ‌య్య‌చౌద‌రికి అక్క‌డ ప్ర‌జ‌ల నుంచి మంచి మ‌ద్ద‌తు వ‌స్తోంది.... మొత్తానికి ప‌శ్చిమ జీరో అనే గ్రాఫ్ నుంచి వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ క్లీన్ స్వీప్ చేయాల‌ని ప్లాన్ ర‌చిస్తోంది. కేడ‌ర్ తో నాయకత్వం కూడా ముందుకు వెళుతుంది. ఇక పాద‌యాత్ర కూడా ఈనెల 14నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి ఎంట‌ర్ కానుంది.
 
విశ్లేష‌ణ !! గ‌ణేష్.వి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.