ఆ ఒక్క‌టి మ‌ర‌చిన వైయ‌స్ జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 04:09:49

ఆ ఒక్క‌టి మ‌ర‌చిన వైయ‌స్ జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రైతాంగాన్ని ఆదుకునేందుకు దివంగత నేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన ప‌ధ‌కాలు తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్ధాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా, ఆరోగ్య‌శ్రీ, రైతు రుణ‌మాఫీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు నీరు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రాజెక్టులు నిర్మించేందుకు జ‌ల‌య‌జ్ఝం ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. 
 
వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో జ‌రిగిన  80 శాతం ప్రాజెక్టు ప‌నుల‌కు పై మెరుగులు దిద్ది తామే పూర్తి చేశామ‌ని చెప్పుకుంటోంది తెలుగుదేశం ప్ర‌భుత్వం. గ‌తంలో మాదిరిగానే  టీడీపీ ప్ర‌భుత్వం రైత‌న్న‌ల‌ను విస్మ‌రిస్తూనే వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర కొన‌సాగిస్తున్న తండ్రికి మించిన త‌న‌యుడిలా  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌దైన శైలిలో రైత‌న్న‌ల‌కు వ‌రాలు  ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ప‌గ‌టి పూట తొమ్మిది గంట‌ల విద్యుత్, వ‌డ్డీలేని రుణాలు, ప్ర‌తి ఏడాది మే నెల‌లో పెట్టుబ‌డి నిధి  కింద రూ,12,500, రైతుల‌కు ఉచితంగా బోర్లు, పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర మూడు వేల కోట్ల రూపాయ‌ల‌తో రైతు స్ధిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు వంటి అనేక హామీల‌ను వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు ప్ర‌క‌టించారు.
 
సామాన్య రైతు పంట పండించేందుకు కావాల్సిన దాదాపు అన్ని  సౌక‌ర్యాలు వైసీపీ అధికారంలోకి రాగానే అందిస్తామ‌ని చెబుతున్న జ‌గ‌న్.......రైతుల‌కు ఇస్తున్న హామీల‌ను ఇక ఆపేస్తారా...లేదా ఇంకా ఉన్నాయా....అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
ప్ర‌స్తుతానికైతే రైతుకు కావాల్సిన క‌నీస అవ‌స‌రాలు తీరేలా హామీలు ప్ర‌క‌టించారు కాని, అస‌లైన సాగునీటి స‌మ‌స్య‌ప‌రిష్కారానికై ఎలాంటి హామీ ప్ర‌క‌టించలేదు జ‌గ‌న్.  ఉచితంగా బోర్లు వేయిస్తామ‌ని ప్ర‌క‌టించినా..అన్ని చోట్ల   బోర్లు ప‌డ‌తాయ‌న్న న‌మ్మ‌కం లేదు. 
 
ముఖ్యంగా పాద‌యాత్ర ముగిసిన రాయ‌ల‌సీమ జిల్లాలో రైత‌న్న‌ల‌కు  జ‌గ‌న్ ప్ర‌క‌టించిన   హామీల‌తో పాటు పంట పండించేందుకు సాగు నీరు    ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో రాయ‌ల‌సీమ నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు జ‌గ‌న్  ఎలాంటి కార్య‌చ‌ర‌ణ  చేయ‌నున్నారు అనే ప్ర‌శ్న‌కు ఇప్పుడు స‌మాధానం దొర‌కాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.