ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై జ‌గ‌న్ ఫుల్ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 09:29:58

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై జ‌గ‌న్ ఫుల్ క్లారిటీ

ప్ర‌జా సంకల్ప పాద‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు కీల‌క హామీలు ఇస్తూ త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశానికి సంబంధించి ఫుల్ క్లారిటీ  ఇచ్చేశారు వైయ‌స్ జ‌గ‌న్.
 
తాను ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తివ్వ‌న‌ని వైయ‌స్ జ‌గ‌న్  తేల్చి చెప్పేశారు. ప్ర‌స్తుతం వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది. జిల్లాలోని పొన్న‌లూరు మండ‌లంలోని పెద వెంక‌న్న పాలెంలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకున్నారు ఎమ్మార్పీయ‌స్ కార్య‌క‌ర్త‌లు.
 
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై వైసీపీ  వ‌ర్ష‌న్ ఏంటో తెలియ‌జేయాల‌ని ఎమ్మార్పీఎస్ నాయ‌కులు జ‌గ‌న్ ను కోరారు. దీనిపై స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్....వ‌ర్గీక‌ర‌ణ అనేది రాష్ట్ర ప‌రిధీలోని అంశం కాదు...కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణ‌య‌మ‌ని, అందుకే తన చేతిలో లేని అంశానికి తాను మ‌ద్ద‌తు ఇవ్వ‌లేన‌ని  కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.