అద‌ర‌గొట్టిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan padayatra gannavaram
Updated:  2018-04-24 06:47:01

అద‌ర‌గొట్టిన జ‌గ‌న్

ప్ర‌తిప‌క్షనేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం నంద‌మూరి కంచుకోట కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం సెగ్మెంట్ లో నిర్విరామంగా కొన‌సాగుతోంది.... ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా గ‌న్న‌వ‌రంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ... ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు...గ‌న్న‌వ‌రంలో నీరు - చెట్టు పేరు కింద‌ విచ్చ‌విడిగా అక్ర‌మంగా టీడీపీ నాయ‌కులు మ‌ట్టి, ఇసుకను త‌ర‌లిస్తున్నార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్... అయితే ఇదంతా చంద్ర‌బాబు ఇంటికి ఆమ‌డ‌ దూరంలో జ‌రుగుతున్నా కానీ ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు...ఈ స్కామ్ మొత్తం ముఖ్య‌మంత్రి హ‌యాంలోనే జ‌రుగుతోంద‌ని అన్నారు... దీంతోపాటు జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం పేరుతో మంచి నీరు కావాల‌న్నా, మ‌రుగు దొడ్లు కావాల‌న్నా టీడీపీ అధికారుల‌కు అధిక సంఖ్య‌లో ముడుపులు చెల్లించవ‌ల‌సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని జ‌గ‌న్ అన్నారు.
 
గ‌న్న‌వ‌రంలో  రైతులు వ‌రి పంట‌ను ఎక్కువ‌గా పండిస్తార‌ని నాలుగు సంవ‌త్స‌రాల నుంచి చంద్ర‌బాబు ఒక్క‌సారైనా గిట్టుబాటు ధ‌ర ప్ర‌క‌టించారా అని జ‌గ‌న్  సూటిగా ప్ర‌శ్నించారు...2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో రైతుకు గిట్టుబాటు ధ‌ర రావాలంటే చంద్ర‌బాబు అధికారంలోకి రావాల‌ని, అలాగే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌ర‌గాలంటే చంద్ర‌బాబు  ముఖ్య‌మంత్రి కావాల‌ని టీవీల్లో ప్ర‌చారం చేసి అధికారాన్ని ద‌క్కించుకున్నార‌ని జ‌గ‌న్  మండిప‌డ్డారు... 
 
ఆరోజు ఈ పెద్ద‌మ‌నిషి జాబురావాలంటే బాబురావాల‌ని అన్నార‌ని, ప్ర‌తీ ఇంటికి ఒక  మ‌నిషిని పంపించి స్వ‌యాన త‌న సంత‌కంతో ఒక లెట‌ర్ ను పంపిచార‌ని అన్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి .... ఆ లేఖ‌లో జాబు రాని ప‌క్షంలో ప్ర‌తీ నిరుద్యోగికి నెల‌కు రెండు వేలరూపాయ‌ల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేయించి అధికారం ద‌క్కించుకున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు... ఈ నాలుగేళ్ల‌ల్లో  ప్ర‌తీ నిరుద్యోగికి చంద్ర‌బాబు తొంబైఆరువేల  అప్పువున్నార‌ని ఎక్క‌డైనా ఆయ‌న క‌నిపిస్తే మా డబ్బు మాకు ఇవ్వాల‌ని నిల‌దీయండ‌ని ప్ర‌జ‌లకు సూచించారు జ‌గ‌న్.
 
అయితే ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేపథ్యంలో చంద్ర‌బాబు మ‌రో కొత్త డ్రామాకు తెర‌లేపుతున్నార‌ని మండిప‌డ్డారు... ప్ర‌తీ ఇంటికి ఒక మ‌నిషిని పంపించి ప్ర‌తీ ఓటుకు మూడువేలు, కేజీ బంగారం,  ఓ బెంజికారు ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మ‌య్యార‌ని ఆరోపించారు... ఆయితే వారు రెండు వేలు ఇచ్చేందుకు వ‌స్తే మాకు రెండువేలు వ‌ద్దు ఐదు వేలు కావాల‌ని డిమాండ్ చేసి, ఓటు మాత్రం మీ మ‌న‌స్సాక్షి  చెప్పిన వారికి ఓటు వేయాల‌ని జ‌గ‌న్ సూచించారు.
 
ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాష్ట్రం అభివృద్ది చెందుతుంద‌ని చంద్ర‌బాబుకు తెలిసి కూడా కొంగ జ‌పం చేస్తున్నార‌ని అన్నారు.. వైసీపీ ఎంపీల‌తో పాటు చంద్ర‌బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉంటే దేశం మొత్తం మ‌న రాష్ట్రం వైపు చూసేది కాదా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.