వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ నియామ‌కం - జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-21 14:43:42

వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ నియామ‌కం - జ‌గ‌న్

2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక ప‌క్క పాద‌యాత్ర చేస్తుంటే మ‌రో ప‌క్క పార్టీ నాయ‌కులు న‌వ‌ర‌త్నాలను ప్ర‌జ‌ల‌కు క్షుణ్ణంగా వివ‌రిస్తూ వారి ద‌గ్గ‌ర నుంచి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ఇక ఇదే త‌ర‌హాలోనే పార్టీని మ‌రింత విస్రృతం చెయ్యాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ పార్టీ త‌ర‌పున రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మించారు. 
 
అయితే ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్ల‌మెంట్ సోష‌ల్ మీడియా అభ్య‌ర్థుల‌ను నియ‌మించిన ఆయ‌న ఇప్పుడు రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ప్ర‌గాడ నాగేశ్వ‌ర‌రావును నియమించారు జ‌గ‌న్. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేశారు. నాగేశ్వ‌ర‌రావు విశాఖ‌పట్నం జిల్లా య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.