జ‌గ‌న్ అను నేను నాలుగు రోజుల్లో మ‌రో రికార్డ్ సృష్టిస్తాను

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-09-20 04:12:24

జ‌గ‌న్ అను నేను నాలుగు రోజుల్లో మ‌రో రికార్డ్ సృష్టిస్తాను

2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తిఒక్క‌రి  ముఖంలో చిరున‌వ్వు చూస్తా... రైత‌న్న‌ల‌కు అండ‌గా నిలుస్తాం... గ‌తంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తి పేద‌వాడికోసం ఒక్కడుగు ముందుకు వేస్తే ఆయ‌న కుమారుడు అయిన నేను ప్ర‌తి పేద‌వాడికోసం రెండు అడుగులు ముందుకు వేస్తాను... గ‌తంలో  దివంగ‌త నేత రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఏవిధంగా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడో తాను కూడా ఏపీ ప్ర‌జ‌ల‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా...
 
ప్ర‌జ‌ల‌కోసం ఎంతవ‌ర‌కు అయినా పోరాటం చేస్తాను అంటూ వారికి కొండంత భ‌రోసా ఇస్తూ ప్ర‌జా సంక‌ల్ప‌ పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్న ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాద‌యాత్ర‌లో మ‌రో రికార్డ్ ను త‌ర్వ‌లో సృష్టించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను, కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కంచుకోట విశాఖ ప‌ట్నం జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. 
 
ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక పాద‌యాత్ర‌ ఈ నెల 24వ తేదిన విజ‌య‌న‌గ‌రం జిల్లా కొత్త‌వ‌ల‌స ద‌గ్గ‌ర‌లోని దేశ‌పాత్రునిపాలేం వ‌ద్ద జ‌గ‌న్ చేరుకోగానే 3000 వేల కిలో మిట‌ర్ల‌ను పాద‌యాత్ర ద్వారా పూర్తి చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ అక్క‌డ భారీ భ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించి ఫైలాన్ ఆవిష్క‌రించ‌బోతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.