ఆ జిల్లాపై జ‌గ‌న్ మ‌న‌సులో ఆలోచ‌న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 11:54:36

ఆ జిల్లాపై జ‌గ‌న్ మ‌న‌సులో ఆలోచ‌న‌

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కు సీనియ‌ర్ నాయ‌కుల మ‌ద్ద‌తే కాదు, జూనియ‌ర్ నాయ‌కులు మ‌ద్ద‌తు మ‌రింత వ‌స్తోంది.. ఇక ఇటీవ‌ల ఫిరాయింపుల ఫోక‌స్  తెలుగుదేశం కాస్త ప‌క్క‌న పెట్టింది అనే చెప్ప‌వ‌చ్చు.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర పై తెలుగుదేశం చేయించే స‌ర్వేలు గ్రాఫ్ లు అన్ని జ‌గ‌న్ కు  ఎంతో ప్ల‌స్ గా వ‌స్తున్నాయి... అయితే ప్రశాంత్ కిషోర్ స్ట్రాట‌జీ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఏమి ఉప‌యోగించ‌డం లేదు, కేవ‌లం జ‌గ‌న్ త‌న దైన శైలితో తెలుగు ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేవిధంగా మాట్లాడుతూ త‌న స్పీచ్ ఇచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు.
 
జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లు మ‌రీ ముఖ్యంగా ఫిరాయింపు సెగ్మెంట్ల‌లో జ‌గ‌న్ కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. జ‌గ‌న్ పాద‌యాత్ర లో పార్టీ నుంచి నాయ‌కుల‌ను, తెలుగుదేశంలోకి తీసుకువెళ్లేందుకు జ‌గ‌న్ పార్టీని నైరాశ్యంలో- డైల‌మాలో పడేసేందుకు పార్టీ అధినేత వేసిన స్కెచ్ స‌ఫ‌లీకృతం కావ‌టం లేదు జిల్లాలో.
 
ఇక నెల్లూరు జిల్లాలో మెజార్టీ సీట్లు గతంలో కంటే ఈ సారి వైసీపీ గెలుచుకునేందుకు అనేక అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.. అదే పందాలో జ‌గ‌న్ ముందుకు వెళుతున్నారు... ఫిరాయింపు సెగ్మెంట్ పై మ‌రింత ఫోక‌స్ చేశారు జ‌గ‌న్ జిల్లా రాజ‌కీయాల్లో... కొత్త నాయ‌కుల‌కు సెగ్మెంట్లో అవ‌కాశం ఇచ్చి పార్టీలో గెలిపించి త‌న పార్టీ స‌త్తా చూపాలి అని జ‌గ‌న్ భావిస్తున్నారు.. అందుకే  జ‌గ‌న్ నెల్లూరు జిల్లాలో మ‌రింత ఫోక‌స్ చేస్తున్నారు.. ఇక్క‌డ మంత్రులు ఇద్ద‌రు ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇద్దరూ తెలుగుదేశం విజ‌యానికి అంత ఫార్మూలాగా ఉప‌యోగ‌ప‌డ‌రు అంటున్నారు జిల్లా నాయ‌కులు. అయితే వైసీపీ మాతం ఇక్క‌డ జిల్లాలో ప‌లువురు సీనియ‌ర్లు జూనియ‌ర్ల‌తో ముందుకు పోతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలి అని జ‌గ‌న్ యోచిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.