జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan image
Updated:  2018-03-03 02:53:02

జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం వైసీపీపోరు బాట ప‌ట్టంది... త‌మ పోరాటం హ‌స్తిన‌లో తీవ్ర‌త‌రం చేయ‌నుంది.
హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదిక ధర్నా నిర్వహించబోతోంది వైసీపీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 5న ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌ వద్ద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నారు. ఈ ధ‌ర్నాకోసం వైసీపీ నాయ‌క‌త్వం హిస్త‌న వెళ్లాలి అని నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా,
 
తాళ్లూరుకు చేరుకున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పార్టీ నాయ‌కుల‌తో ప్రజాప్రతినిధులతో స‌మావేశ‌మైన జ‌గ‌న్ 
వారికి దిశా నిర్దేశం చేశారు...  పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతల ఢిల్లీ యాత్రను వైఎస్‌ జగన్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
 
పార్టీ నాయ‌కులు అంద‌రూ క‌లిసి హ‌స్తిన‌లో ఈ నెల 5న దిల్లీలో ధ‌ర్నానిర్వ‌హించ‌నున్నారు.. ఈ ధ‌ర్నా కోసం వైసీపీ ప్ర‌త్యేక  రైలును ఏర్పాటు చేసింది... విజ‌య‌వాడ నుంచి హ‌స్తిన వెళ్లి వైసీపీ ప్ర‌త్యేక హూదా కోసం త‌మ గ‌ళాన్ని విప్ప‌నుంది. జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి జెండా ఊప‌డంతో రాజ‌కీయంగా తెలుగుదేశం ఇప్పుడు ఎటువంటి అడుగులు వేస్తుందా అనేది చూడాలి.. వైసీపీ ఎంపీలు రాజీనామాల‌కు సిద్దం, అలాగే తెలుగుదేశం నాయ‌కులు రాజీకి వ‌స్తారా లేదా వైసీపీ ఎంపీల‌కు స‌పోర్ట్ గా నిల‌బ‌డ‌తారా అనేది పార్ల‌మెంట్లో తేల‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.