నేష‌న‌ల్ మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan image
Updated:  2018-03-13 11:34:45

నేష‌న‌ల్ మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చిన జ‌గ‌న్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి ఎంతో స్పంద‌న వ‌స్తోంది. ఇక పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్  పై ఇప్ప‌టికే నేష‌న‌ల్ మీడియా ఫోక‌స్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల పై సమ‌గ్ర విశ్లేష‌ణ చేస్తున్నారు సౌత్ స్టేట్స్ లో, ఏపీ ఒక‌టి ఇది ఎటువంటి పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకోబోతోందో అనేలా ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఆలోచిస్తున్నారు కేంద్రంలో పెద్ద‌లు.  పాదయాత్ర కొనసాగిస్తున్న జననేతతో జాతీయ మీడియా ప్రత్యేక ముఖాముఖి నిర్వ‌హించింది.ఆన్‌ రియాలిటీ చెక్  పేరిట పాదయాత్రలో జగన్‌తో ముచ్చటించారు ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌
శ్రీనివాసన్‌ జైన్‌.
 
తన పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  గ‌తంలో చెప్పిన విధంగానే అరుణ్ జైట్లీ చెప్పార‌ని సేమ్ అదే చెప్పినా ఎందుకే కేంద్రం నుంచి ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు కేబినెట్ నుంచి ఇద్ద‌రు మంత్రుల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు అని అన్నారు జ‌గ‌న్... మాకు  బీజేపీతో ఎటువంటి లింక్స్ లేవ‌ని జ‌గ‌న్ తెలియ‌చేశారు నాపై గ‌తంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు క‌లిసి కేసులు పెట్టాయి అని ఆయ‌న తెలియ‌చేశారు.
 
త‌మకు బీజేపీతో ఒప్పందాలు స‌త్సంబంధాలు ఉంటే ఎందుకు మేము వారిపై అవిశ్వాసం పెడ‌తామని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ చేతులు కలిపి తనను కేసులలో ఇరికించాయని, దివంగత నేత వైఎస్‌ఆర్‌ బతికి ఉన్నంతకాలం తనను గౌరవనీయుడిగా చూశారని, ఆయన చనిపోయిన తర్వాత క్షుద్రరాజకీయాల్లో భాగంగా తనను టార్గెట్‌ చేశారని తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేదని అన్నారు. ఇక త‌న‌పై కేసులు ఆనాడు పెట్టిన వారిలో కాంగ్రెస్ త‌ర‌పున శంకర్రావు, తెలుగుదేశం త‌ర‌పున ఎర్ర‌న్నాయుడు, ఇప్పుడు రాజీనామా చేసిన కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఉన్నారు అని అన్నారు జ‌గ‌న్.. ఇక తాము బీజేపీలో క‌లుస్తాము అని అంటున్నారు. వాస్త‌వాల‌నికి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇస్తే వారికి మ‌ద్ద‌తు ఇస్తాం, క‌లసి ముందుకు వెళ‌తాం అని అన్నారు జ‌గ‌న్.
 
ఏపికి సంబంధించినంత వ‌ర‌కూ మోదీ విఫ‌ల‌మ‌య్యారు ఏపీకి ఇచ్చిన మాట నెర‌వేర్చ‌లేదు అని అన్నారు జ‌గ‌న్...
ఏపీ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా తాము విజ‌యం సాధిస్తామ‌ని తెలియ‌చేశారు. మొత్తానికి ఏపీకి కేంద్రం లో ఉన్న బీజేపీ ఎటువంటి న్యాయం చేయలేద‌ని, కేవ‌లం ఏపీకి ఎవ‌రు న్యాయం చేసి ప్ర‌త్యేక హూదా ఇస్తారో వారితోనే క‌లిసి ముందుకు వెళ‌తామ‌న్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.